ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన లేడీ డాక్టర్.. అలా ఎందుకు చేసిదంటే..?

ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన లేడీ డాక్టర్.. అలా ఎందుకు చేసిదంటే..?

Crime

Lady doctor who cut boyfriend genitals : బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా వైద్యురాలు పెళ్లి చేసుకునేందుకు రాలేదని తన ప్రియుడిని కట్టేసి అతని జననాంగాలను కోసేసింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళా వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రక్తపు మడుగులో పడిఉన్న వ్యక్తిని పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చేర్పించారు. సదరు వ్యక్తి మధురా బ్లాక్ లోని వార్డు నెంబర్ 12 కౌన్సిలర్. మహిళా వైద్యురాలిని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.. ఆమెపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Also Read : అభిమానం చాటుకున్న జనసైనికులు.. ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారు

మహిళా వైద్యురాలు ప్రియుడి పట్ల దారుణంగా వ్యవహరించడానికి కారణం ఏమిటని పోలీసులు విచారణ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా వైద్యురాలు అవివాహిత. ఆమె వయస్సు 25ఏళ్లు. ఆమెది హజిపూర్ స్వస్థలం. అయితే మధౌరాలో ప్రాక్టీసు చేస్తోంది. బాధితుడు మధురా బ్లాక్ లోని 12వ వార్డు కౌన్సిలర్. అతడికి కూడా పెళ్లికాలేదు. అయితే, వీరిద్దరూ గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని మహిళా వైద్యురాలు అతనిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు వారు సిద్ధమయ్యారు. పెళ్లికోసం ఆమె ముందుకు రిజిస్ట్రార్ కార్యాలయంకు వెళ్లింది. కానీ, ప్రియుడు మాత్రం రాలేదు. సాయంత్రం వరకు వేయిఉన్నా అతను రాకపోవడంతోపాటు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ప్రియుడు తీరుతో లేడీ డాక్టర్ ఆగ్రహానికి గురైంది.

Also Read : Armaan Malik : ఈ యూట్యూబర్‌కి రెండు పెళ్లిళ్లు కాదు.. మూడు పెళ్లిళ్లు.. సంచలన విషయాలు చెప్పిన భార్య..

మరుసటి రోజు తన ఇంటికి ప్రియుడిని పిలిచింది. ఇంటికి వచ్చిన ప్రియుడితో వాగ్వివాదానికి దిగింది. వారి మధ్య మాటామాటా పెరగడంతో ప్రియుడి జననాంగాన్ని కత్తితో కట్ చేసింది. దీంతో సదరు వ్యక్తి కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడకు చేరుకొని పరిస్థితిని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకోగా.. అప్పటికే బెడ్ పై రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. నిందితురాలు లేడీ డాక్టర్ ను అరెస్టు చేశారు.