Rajasthan : ఎడారిలో ఒంటెపై ప్రయాణం చేసి మారుమూల ప్రజలకు వ్యాక్సిన్ వేసిన మహిళ

ఎడారిలో ఒంటెపై ప్రయాణం చేసి మారుమూల గ్రామ ప్రజలకు వ్యాక్సిన్ వేసారు ఓ మహిళా ఆరోగ్య కార్యకర్త. కేంద్ర ఆరోగ్యం మంత్రి పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Rajasthan : ఎడారిలో ఒంటెపై ప్రయాణం చేసి మారుమూల ప్రజలకు వ్యాక్సిన్ వేసిన మహిళ

Camel

Updated On : December 24, 2021 / 6:22 PM IST

Female health worker rides camel for vaccination drive : రాజస్థాన్ అంటే ఎడారి రాష్ట్రం అనే విషయం తెలిసిందే.అటువంటి రాష్ట్రంలో ఎక్కడెక్కడో విసిరేసినట్లుగా ఉంటాయి కొన్ని గ్రామాలు. ఆ గ్రామాలకు వెళ్లాలంటూ కిలోమీటర్లకొద్దీ మండే ఇసుక ఎడారిలో నడిచి వెళ్లాల్సిందే. అటువంటి ఓ మారు మూల గ్రామంలో ప్రజలకు వ్యాక్సినేషన్ వేయటం అంటే ప్రయాసతో కూడుకున్న పనే.

కానీ వారికి కూడా వ్యాక్సిన్ వేయాలనే మంచి మనస్సుతో ఓ ఆరోగ్య కార్యకర్త ఇసుక ఎడారిలో ఒంటెపై ప్రయాణం చేసిన మరీ వెళ్లి ఆ గ్రామస్తులకు వ్యాక్సిన్ వేశారు. ఆమె అంకిత భావానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చేసిన ఈ గొప్ప పనికి కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్సుఖ్ మాండవ్య తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కర్తవ్యం పట్ల ఆమెకు నిబ్ధతను తెలియజేస్తోందీ ఫోటో.

రాజస్థాన్ లో ఓ కుగ్రామంలోని ప్రజలకు వ్యాక్సిన్ వేయటానికి ఓ మహిళా ఆరోగ్య కార్యకర్త సాహాసం చేశారనే చెప్పాలి. బాడ్ మేర్ జిల్లాలో ఓ మహిళ ఎడారిలో ఒంటెమీద ప్రయాణించి మరీ వెళ్లి వ్యాక్సినేషన్ వేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజలు కూడా ఈ ఆరోగ్య కార్యకర్త నిబద్ధతకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.