బీచ్‌లో తొక్కిసలాట.. నలుగురి మృతి.. 230 మందికి గాయాలు

వారిని స్థానికంగా ఉండే మూడు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

బీచ్‌లో తొక్కిసలాట.. నలుగురి మృతి.. 230 మందికి గాయాలు

Updated On : October 6, 2024 / 8:59 PM IST

చెన్నై మెరీనా బీచ్‌లో తొక్కిసలాట చోటుచేసుకుని నలుగురు మృతి చెందారు. మరో 230 మందికిపైగా గాయపడ్డారు. బీచ్‌లో మెగా ఎయిర్‌ షో వీక్షించేందుకు వేలాది మంది సందర్శకులు తరలిరావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

తీవ్ర రద్దీగా ఉండడం, ఉక్కపోతతో చాలామంది సందర్శకులు సొమ్మసిల్లి అక్కడే పడిపోయారు. వారిని స్థానికంగా ఉండే మూడు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌లోనూ సందర్శకులు వేల సంఖ్యలో కనపడ్డారు.

మెరీనా బీచ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఎయిర్ షో ప్రారంభం కావడం, ఇవాళ సెలవు దినం కావడంతో చెన్నైలోని ఆ బీచ్‌కు ఇంత మంది జనాలు వచ్చారు. ఈ షో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో రాఫెల్, తేలికపాటి యుద్ధ విమానం తేజస్, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచంద్, హెరిటేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ డకోటా వంటి 72 విమానాలను ప్రదర్శించారు.

ఈ షోను చూడడానికి రైళ్లు, మెట్రో, కార్లు, బస్సుల ద్వారా దాదాపు 13 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చినట్లు తెలుస్తోంది. వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, రాష్ట్ర మంత్రులు, చెన్నై మేయర్ ఆర్ ప్రియ, తదితరులు కూడా హాజరయ్యారు.

Heavy Traffic and Crowds in Chennai Due to Marina Beach Air Show

Chennai saw heavy traffic and crowded stations as people swarmed Marina Beach for the air show.#chennaiairshow #Chennai #MarinaBeach #AirShow #AirShow2024 #IndianAirForce #AirForce #Traffic #MarinaBeachShow pic.twitter.com/ZmtRZczhXu

— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) October 6, 2024

Viral Video: ఈ ఫుట్‌పాత్‌పై నడిచేది ఎలా? వీడియో వైరల్