Bank Exams : బ్యాంక్ జాబ్స్ ఎగ్జామ్స్ కు బ్రేక్..పరీక్ష తెలుగులోనే ఉంటుందా?
బ్యాంక్ ఎగ్జామ్స్ కు బ్రేక్ పడింది. ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు పరీక్షలను నిలుపుదల చేయాలంటూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్‌కు (ఐబీపీఎస్) ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇంగ్లిష్, హిందీ భాషల్లో క్లరికల్ క్యాడర్ టెస్ట్ నిర్వహించేందుకు ఐబీపీఎస్ ఇటీవల ప్రకటించింది.

Bank Exams
Finance Ministry Hold On Banking Ibps Exam: బ్యాంక్ ఉద్యోగం సంపాదించాలని చాలామంది కసరత్తులు చేస్తుంటారు. ఎలాగైనా బ్యాంకు జాబ్ సంపాదించటానికి ప్రిపేర్ అవుతుంటారు. దానికి సంబంధించి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. ఆ సమయం రానే వచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దాదాపు ఖరారు అయ్యింది. కానీ ఇంతలోనే బ్రేక్ పడింది. కారణం..ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలు నిర్వహించాలా? లేదా ఎప్పుడూ లాగే ఇంగ్లీషులోనే ఉండాలా? అనే విషయం గురించి బ్రేక్ పడింది.
ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు పరీక్షలను నిలుపుదల చేయాలంటూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్‌కు (ఐబీపీఎస్) ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇంగ్లిష్, హిందీ భాషల్లో క్లరికల్ క్యాడర్ టెస్ట్ నిర్వహించేందుకు ఐబీపీఎస్ ఇటీవల ప్రకటించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్ కేడర్‌కు స్థానిక,ప్రాంతీయ భాషల్లో టెస్ట్ నిర్వహించాలన్న డిమాండ్‌ను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘కమిటీ సిఫార్సులను 15 రోజుల్లో అందజేస్తుందనీ..ఇవి అందుబాటులోకి వచ్చే వరకు పరీక్షను నిలిపివేస్తున్నాం’ అని వెల్లడించింది. కాగా..ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలనే డిమాండ గత కొంతకాలంలో వస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ వస్తోంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) ఉద్యోగాల భర్తీకి ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ 2019 జూలైలో పార్లమెంటులో స్పష్టం చేసింది.