BJP కంప్లయింట్ : కంప్యూటర్ బాబాపై FIR నమోదు

కంప్యూటర్ బాబాగా పేరొందిన త్యాగిపై పోలీసులు FIR నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై కేసు ఫైల్ చేశారు. భోపాల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున దిగ్విజయ్ సింగ్ బరిలో నిలిచారు. కంప్యూటర్ బాబా మే 07వ తేదీన భారీ హోమం నిర్వహించారు. డిగ్గీ రాజా విజయం సాధించాలనే హోమం నిర్వహించారని బీజేపీ ఆరోపించింది. ఇంకేముంది..ఎన్నికల సంఘానికి మే 09 కంప్లయింట్ చేశారు.
నియోజకవర్గంలో బాబా మతపరమైన భావాలు రెచ్చగొట్టారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని కంప్యూటర్ బాబా ఖండించారు. తాను నిర్వహించింది రాజకీయ కార్యక్రమం కాదన్నారు. ఎన్నికల సంఘం బాబా చేసిన హోమంపై దర్యాప్తు చేపట్టింది. జిల్లా కలెక్టర్..ఎన్నికల అధికారి సుదామా ఖడే దర్యాప్తు నిర్వహించారు. కంప్యూటర్ బాబా నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు తేల్చారు. సెక్షన్ 188 ప్రకారం ఆయనపై కేసు నమోదు చేశారు. భోపాల్ నియోజకవర్గంలో మే 12వ తేదీన ఎన్నికలు జరిగాయి. దిగ్విజయ్ సింగ్‌కు పోటీగా బీజేపీ అభ్యర్థిగా ప్రగ్యా సింగ్ ఠాకూర్ బరిలో నిలిచారు. మే 19న ఎన్నికలు పూర్తి కానున్నాయి. మే 23న ఫలితాలు వెలువడడనున్నాయి.