Madhya Pradesh : ఇంట్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం

తీవ్ర కాలిన గాయాలైన వృద్ధ దంపతులను చికిత్స కోసం గ్వాలియర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Madhya Pradesh : ఇంట్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం

Fire broke out (1)

Updated On : June 10, 2023 / 9:14 PM IST

Fire broke out : మధ్యప్రదేశ్ లో విషాదం నెలకొంది. ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సజీవ దహనం అయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన భింద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గోర్మి పోలీస్ స్టేషన్ పరిధిలోని దానేకపురాలో శనివారం ఉదయం ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి.

ఆ మంటల్లో చిక్కుకుని ముగ్గురు చిన్నారులు సజీవ దహనం అయ్యారు. మృతి చెందిన చిన్నారుల్లో
నాలుగేళ్ల బాలుడు, పదేళ్ల బాలిక, నాలుగేళ్ల మరో బాలికగా గుర్తించారు. ఇంటి యజమాని అఖిలేష్ రాజ్ పుత్, అతడి భార్య, కూతురు, కోడలు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

Fire Accident : హైదరాబాద్ లో అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

కాగా, తీవ్ర కాలిన గాయాలైన వృద్ధ దంపతులను చికిత్స కోసం గ్వాలియర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి
తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో చనిపోయిన పిల్లలు ఇంటి యజమాని మనుమళ్లని చెప్పారు. గాయపడిన కుమార్తె, కోడలును గోర్మిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

వంట చేస్తుండగా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల అసలు కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు.