Ram Mandir golden door
Ram Mandir : రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలోని రామమందిరంలో మొట్టమొదటిసారి బంగారు తలుపును ఏర్పాటు చేశారు. జనవరి 22 వతేదీన రామమందిరాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో గర్భగుడి మొదటి అంతస్తులో బంగారు తలుపు ఏర్పాటు చేశారు. గర్భగుడి పై అంతస్తులో 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న తలుపును ఏర్పాటు చేశారు. మరో మూడు రోజుల్లో మరో 13 బంగారు తలుపులు ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.
ALSO READ : విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించిన మై హోమ్ గ్రూప్, ప్రారంభించిన కపిల్ దేవ్
రామాలయంలో మొత్తం 46 తలుపులు ఏర్పాటు చేయగా, వాటిలో 42 తలుపులకు బంగారు పూత పూయనున్నట్లు యూపీ సీఎంఓ కార్యాలయం తెలిపింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ మందిర ప్రారంభోత్సవం దృష్ట్యా ఆ రోజు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 22 న సెలవు ప్రకటించారు. ఆలయం ప్రారంభోత్సవం రోజున యూపీ రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ALSO READ : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ.. సమగ్రమా? తూతూ మంత్రమా?
వేడుకల సన్నాహాలను సమీక్షించడానికి అయోధ్యకు వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో పరిశుభ్రత పాటించేలా కుంభ్ మోడల్ ను అమలు చేయాలని ఆదేశించారు. జనవరి 14న అయోధ్యలో పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జనవరి 22 వతేదీన అయోధ్య ఆలయంలో ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం కోసం అలంకరించనున్నారు.
ALSO READ : Guntur Kaaram : గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర ప్రత్యేక ఆహ్వానితులు ఈ మెగా ఈవెంట్‌కు హాజరుకానున్నారు. ఆలయ ట్రస్ట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఆహ్వానితుల జాబితాలో రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలతో సహా 7,000 మందికి పైగా ఉన్నారు.