అక్కడి నుంచి తొలిసారి ఎన్నికల పోటీలో మహిళ

ఈశాన్య రాష్ట్రం మిజోరం లోక్‌సభ ఎన్నికల చరిత్రలో తొలి సారి ఓ మహిళ లోక్ సభ ఎన్నికల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

  • Published By: vamsi ,Published On : March 29, 2019 / 02:01 AM IST
అక్కడి నుంచి తొలిసారి ఎన్నికల పోటీలో మహిళ

Updated On : March 29, 2019 / 2:01 AM IST

ఈశాన్య రాష్ట్రం మిజోరం లోక్‌సభ ఎన్నికల చరిత్రలో తొలి సారి ఓ మహిళ లోక్ సభ ఎన్నికల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

ఈశాన్య రాష్ట్రం మిజోరం లోక్‌సభ ఎన్నికల చరిత్రలో తొలి సారి ఓ మహిళ లోక్ సభ ఎన్నికల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎస్‌టీ రిజర్వుడు నియోజకవర్గమైన మిజోరం లోక్ సభకు అభ్యర్ధిగా 63 ఏళ్ల లాల్త మువాని పోటీ చేస్తున్నారు.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష

ఈ నియోజకవర్గం నుండి మొత్తం ఆరుగురు బరిలో దిగగా.. అందులో లాల్త ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగింది. మిజోరంలోని ఏకైక పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7,84,339 ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటర్లు 4,02,408 మంది ఉండగా, పురుష ఓటర్ల 3,81,991 మంది ఉన్నారు.

ఇదిలా ఉంటే గత ఎన్నికల సమయంలో లాల్త మువాని ఐజ్వాల్‌ దక్షణం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఈమెకు 69ఓట్లు రాగా.. ఇప్పుడు లోక్‌ సభ బరిలో నిలిచారు. మిజోరం నుంచి పోటీ చేస్తున్న తొలి మహిళను నేనే అయినందుకు గర్వంగా ఉందని లాల్త మువాని చెబుతుంది. మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నప్పటికీ వారికి సరైన ప్రాధాన్యం దక్కలేదని, హక్కుల సాధన కోసమే నేను పోటీ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. 
Read Also : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రివ్యూ