డేర్ డెవిల్ ఫీట్స్ లో ఫస్ట్ ఉమెన్ : కెప్టెన్ శిఖా సురభీ
ఢిల్లీ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..అద్భుతంగా ఆర్మీ ఫీట్స్..డేర్ డెవిల్ టీమ్స్ కు 84 ఏళ్లు..దేశంలోనే ఫస్ట్ టైమ్ డేర్ డెవిల్స్ టీమ్ లో మహిళా కెప్టెన్ శిఖా సురభి

ఢిల్లీ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..అద్భుతంగా ఆర్మీ ఫీట్స్..డేర్ డెవిల్ టీమ్స్ కు 84 ఏళ్లు..దేశంలోనే ఫస్ట్ టైమ్ డేర్ డెవిల్స్ టీమ్ లో మహిళా కెప్టెన్ శిఖా సురభి
ఢిల్లీ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్
అద్భుతంగా ఆర్మీ ఫీట్స్
డేర్ డెవిల్ టీమ్స్ కు 84 ఏళ్లు
దేశంలోనే ఫస్ట్ టైమ్ డేర్ డెవిల్స్ టీమ్ లో మహిళా కెప్టెన్ శిఖా సురభి
ఢిల్లీ : జనవరి 26 దేశ గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే )అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో ఇండియన్ ఆర్మీ చేసే అద్భుత విన్యాసాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. వారు చేసే ఫీట్స్ చూసేవారికి ఒళ్లు జలదరించేలా చేస్తాయి. ఈ విన్యాసాలను డేర్ డెవిల్స్ ఫీట్స్ అంటారు. పేరులోనే డేరింగ్ వుండే ఆ ఫీట్స్ చేయాలంటే ఎంతో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మరెంతో కష్టపడాలి. రాత్రికి రాత్రే డేర్ డెవిల్స్ అయిపోరు. దీని వెను వారు పట్టుదల..కృషి..ఎంతో కష్టతరమైన ప్రాక్టీ ఉంటుంది. ఇవి సాధారణంగా పురుషులే ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఈ డేర్ డెవిల్ ఆర్మీలో తొలిసారిగా ఓ మహిళా అధికారి పాల్గొన్నారు. ఆమే 28 ఏళ్ల కెప్టెన్ శిఖా సురభీ.. డేర్ డెవిల్స్ టీమ్‌తో కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ 350 సీసీ బైకుపై విన్యాసాలు చేసి విశేషంగా ఆకట్టుకున్నారు.
ఈ ఏడాదితో డేర్‌డెవిల్స్ టీమ్ 84 సంవత్సరాలు పూర్తిచేసుకోనున్నది. ఈ సందర్భంగా ఈ టీమ్ నుంచి తొలిసారిగా ఓ మహిళా అధికారి బైకుపై విన్యాసాలు ప్రదర్శించారు. 136 మంది జవాన్లు, 30 బైకులపై జరిగే విన్యాసాల్లో ఆమె పాల్గొన్నారు. ఆమె పేరు కెప్టెన్ శిఖా సురభీ. డేర్‌డెవిల్స్ టీమ్‌తో కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ 350 బైకుపై విన్యాసాలు చేసేందుకు ఆమె కృషి అసామాన్యం. ఆఫ్రో ఏసియన్ గేమ్స్ తదితర జాతీయ క్రీడా పోటీల్లో తమ విన్యాసాలను ప్రదర్శిస్తూ వస్తున్న డేర్‌డెవిల్స్ టీమ్‌లో ఇప్పటివరకు మహిళలు ఎవరూ పాల్గొనలేదు. ఢీల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్‌లో ముగ్గురు అధికారులు, 136 మంది జవాన్లు 34 బైకులపై విన్యాసాలను ప్రదర్శిస్తారు. వీరితో పాటు సురభీ కూడా బైకుపై నిలుచొని సగర్వంగా సెల్యూట్ చేసి ఆహుతులను అలరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేసిన సురభీకి ఆటలంటే చాలా చాలా ఇష్టం. అందులోను ప్రమాదకరమైన ఆటలు ఆడటంతో సురభి దిట్ట. ఆ ఇష్టమే భారత సైన్యంలోకి చేరేందుకు ప్రేరేపించిందని..ముందు బాక్సింగ్, బాస్కెట్ బాల్ గేమ్స్‌లో రాణించింన సురభి ఆర్మీలోకి రాకముందే బైకులు నడిపిన సురభి ఇప్పుడు దేశ చరిత్రలో తనకంటు ఓ చరిత్రను సృష్టించుకున్నేన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు..బుల్లెట్ వంటి బైకుల హ్యాండిల్ చేయటం అంత ఈజీ కాదనీ..అందులోనే డేర్ డెవిల్ ఫీట్స్ అనేవి చాలా ప్రమాదంతో కూడుకున్నవనీ..రాత్రికి రాత్రి నేర్చుకునేది అంతకన్నా కాదన్నారు. ఈ ఫీట్స్ లో పాల్గొనాలనే కోరికతో ఎంతగానో ప్రాక్టీస్ చేసానని ఆమె తెలిపారు. చేతులు వదిలి బైకు నడపడం..నడుస్తున్న బైకు మీద నిలబడి సెల్యూట్ చేయడం వంటివి టీమ్ వద్ద చాలా టెక్నిక్స్ నేర్చుకున్నాని సురభి తెలిపారు. మూడు నెలలుగా టీమ్‌తో కలిసి ఈ ఫీట్స్ ప్రాక్టీస్ చేసానన్నారు. ఈ ఫీట్స్ లో పాల్గొనటం తన అదృష్టమనీ..దీంతో ఆత్మవిశ్వాసంగా మరింతగా పెరిగిందనీ సురభీ తెలిపారు.