జాతి కాదు కావాల్సింది సత్తా : వీధి కుక్కలకు పోలీస్ ట్రైనింగ్

ఉత్తరాఖండ్ లో వీధి కుక్కలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది చాలా చిత్రమైన విషయం. పోలీసు డిపార్ట్ మెంట్ లలో పనిచేసే కుక్కలు ప్రత్యేకమైన జాతికి చెందినవే ఉంటాయి. చిన్నప్పటి నుంచే వాటిని ప్రత్యేకంగా పెంచుతారు. ప్రత్యేక ఆహారం..అలవాట్లు.. విషయాలలో స్పెషల్ కేర్ తీసుకంటారు. వాటిని ధృడంగా తయారు చేస్తారు. సమయానుకూలంగా వ్యవహరించేలా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాదు స్పెషల్ టెక్నిక్స్ తో కూడిన పోలీస్ ట్రైనింగ్ ఇప్పిస్తారు. వాటికి జ్ఞాపక శక్తితో పాటు…దేనైనా సరే ఈజీగా గుర్తించే విధంగా..ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకునే విధంగా తయారుచేస్తారు. ఇదంతా వెరీ వెరీ స్పెషల్ ట్రైనింగ్ తో కుక్కలు దృంఢంగా..షార్ప్ గా తయారవుతాయి. ప్రత్యేక జాతికి చెందిన కుక్కలే ఈ ట్రైనింగ్ కు అనుగుణంగా మారతాయి. వాటికా సామర్థ్యం ఉంటుంది.
కానీ వీధి కుక్కలకు పోలీస్ ట్రైనింగ్ ఇవ్వటం ఉత్తరాఖండ్ లో విశేషంగా మారింది. ఉత్తరాఖండ్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. ఉత్తరాఖండ్ పోలీసులు వీధి కుక్కలను పోలీసు బలగాలలో చేర్చడానికి వాటికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. స్నిఫర్ కుక్కలతో పాటు వీధి కుక్కల ట్రైనింగ్ సెషన్ నుండి ఉత్తరాఖండ్ పోలీసులు ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. ఇక ఈ శిక్షణ ఇస్తున్న సమయంలో వీధి కుక్కలు కూడా చాలా శ్రద్దగా నేర్చుకోవడం మరో విశేషమని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో చూస్తే అది తెలుస్తోంది. స్నిఫర్ కుక్కలలాగానే వీధి కుక్కలు కూడా ఏమాతం తీసుపోమంటూ తమ సత్తాను ప్రదర్శించాయి.
అడ్డంకులను అధిగమించి పోలీసు అధికారులతో పాటు కవాతు కూడా చేశాయి వీధికుక్కలు. దీనిపై ట్విట్టర్ లో షేర్ చేస్తూ..ఈ స్నిఫర్ డాగ్ టీంని # ఉత్తరాఖండ్ పోలీస్ లకు గర్వంగా భావిస్తున్నాం. ఉత్తరాఖండ్ పోలీసులు ఈ డాగ్ స్క్వాడ్‌లో చేరడానికి వీధి కుక్కలకు శిక్షణ ఇచ్చారు. ఈ టీమ్ ప్రదర్శించిన కొన్ని అద్భుతమైన విన్యాసాలు చూడండి అంటూ ట్వీట్ చేశారు అధికారులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీధుల్లో బ్రతికే కుక్కలు కూడా స్పెషల్ ట్రైనంగ్ తో జాతి కుక్కల్లా తయారు కావటం..వాటికి ట్రైనింగ్ ఇచ్చిన అధికారులపై ప్రసంశలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
#UttarakhandPolice की शान है यह स्निफर डॉग दल। देश में पहली बार उत्तराखंड पुलिस ने गली के स्ट्रीट डॉग को ट्रेन कर इस श्वान दल में शामिल करने का प्रयोग किया है। देखिये इस दल के कुछ जांबाज करतब। pic.twitter.com/sQ1o1gxgDX
— Uttarakhand Police (@uttarakhandcops) November 18, 2019