Uttarakhand : కేదార్‌నాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు యాత్రికుల మృతి

కేదార్‌నాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఐదుగురు యాత్రికులు మరణించారు. కొండచరియలు కారుపై విరిగిపడటంతో అందులో ఉన్న ఐదుగురు యాత్రికులు మృత్యువాత పడ్డారు....

Uttarakhand : కేదార్‌నాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు యాత్రికుల మృతి

landslide debris falls

Updated On : August 12, 2023 / 9:25 AM IST

Uttarakhand : కేదార్‌నాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఐదుగురు యాత్రికులు మరణించారు. కొండచరియలు కారుపై విరిగిపడటంతో అందులో ఉన్న ఐదుగురు యాత్రికులు మృత్యువాత పడ్డారు. (Five pilgrims killed) సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. (landslide debris falls on car) ఎడతెరిపిలేని వర్షం వల్ల సహాయ పనులకు ఆటంకం కలిగించిందని పోలీసులు తెలిపారు.

MiG-29 fighter jets : శ్రీనగర్ ఎయిర్‌బేస్ వద్ద మిగ్-29 ఫైటర్ జెట్ మోహరింపు

శుక్రవారం వాతావరణం తేరుకోవడంతో కారులో నుంచి ఐదు మృతదేహాలను బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. యాత్రికులు ప్రయాణిస్తున్న కారు ఫాటా నుంచి సోన్‌ప్రయాగ్‌కు వెళుతుండగా పర్వతం పైనుంచి రాళ్లు, బండరాళ్లు పైన పడ్డాయి. కేదార్ నాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీవర్షాలు కురవనున్న నేపథ్యంలో ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.