మహిళలను అసభ్యంగా ఫోటోలు తీసిన యువకుడి అరెస్ట్

flashes at 2 women after calling them for help : ముంబైలోని విద్యావిహార్ రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు మహిళలను అసభ్యంగా పోటోలు తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం, అక్టోబర్ 10 మధ్యాహ్నం సమయంలో ఈ జరిగిన ఘటనలో నిందితుడు 27 ఏళ్ల బిట్టు పాల్సింగ్ పార్చా (27)ను అరెస్ట్ చేశారు.
విద్యా విహార్ రైల్వే స్టేషన్ లోంచి బయటకు వచ్చిన ఇద్దరు మహిళలను, స్టేషన్ బయట కారులో కూర్చున్న ఒక వ్యక్తి తనకు కావాల్సిన అడ్రస్ గురించి అడిగాడు. ఆ మహిళలు అడ్రస్ చెప్పటం కోసం కారు వద్దకు రాగానే తన ప్యాంట్ జిప్పు ఊడ తీసి మర్మాంగాలను చూపిస్తూ మహిళలతో కలిపి సెల్ఫీ తీసాడు. వారు అభ్యంతరం చెప్పేలోపే సెల్ఫీ ఫోటోతీసుకుని కారులో ఉడాయించే సరిక మహిళలు ఖంగుతిన్నారు.
వెంటనే వారు కారు నెంబరు నోట్ చేసుకుని తిలక్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు కారు నెంబర్ ఆధారంగా నిందితుడు బిట్టు పాల్సింగ్ పార్చా ను నటరాజ్ బార్ సమీపంలో అరెస్ట్ చేశారు. స్వీపర్ గా పనిచేసే బిట్టూ తన స్నేహితుడి కారు తీసుకుని జల్సా చేస్తూ… మహిళలపై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354(ఏ)(1), 509, 336 ల కింద కేసు నమోదు చేశారు.