Flipkart Big Diwali Sale
Flipkart Big Diwali Sale : పండుగ సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు వ్యాపార సంస్థలు పోటీలు పడుతున్నాయి. ఇక ఈ కామర్స్ సంస్థల గురించి చెప్పక్కర్లేదు. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందకు ప్రత్యేక ఆఫర్లు, భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో అడుగు ముందుకేసింది. బిగ్ దివాళి సేల్‌ను అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.. ఇందులో భాగంగా ఎస్బీఐ డెబిట్ కార్డు యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. బిగ్ దివాళి సేల్ సందర్భంగా పలు ఉత్పత్తులను ఎస్బీఐ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును(ఇన్ స్టంట్ డిస్కౌంట్) ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.
Petrol : లీటర్ కేవలం రూ.1.50.. ఆ దేశంలో అగ్గిపెట్టె కంటే పెట్రోల్ చీప్
రియల్ మీ సీ11, రియల్‌మీ సీ21వై, శాంసంగ్ ఎఫ్12, పోకో జీ3 ఎఫ్‌టీ, రియల్‌మీ నార్జో 50ఏ, మోటోరోలా జీ60, ఒప్పో రోనో 6 5జీ వంటి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఎస్బీఐ డెబిట్ కార్డుదారులకు మరింత తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. బిగ్ దీపావళి డేస్ సేల్ సందర్భంగా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలుపై 80 శాతం వరకు తగ్గింపును అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. డెస్క్‌టాప్‌ల కొనుగోలుపై 30 శాతం వరకు, పవర్ బ్యాంక్‌లపై 75 శాతం వరకు, హెడ్‌ఫోన్, స్పీకర్లపై 70 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.
గృహోపకరణాల విషయానికి వస్తే… టీవీలపై 75 శాతం వరకు, మైక్రోవేవ్ ఓవెన్‌లపై 45 శాతం వరకు, ఎయిర్ కండీషనర్లపై 55 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు జరగనుంది.
Turmeric : పసుపుతో క్యాన్సర్ చికిత్స సాధ్యమేనా!..
డిస్కౌంట్లే కాదు కస్టమర్ల కోసం క్రేజీ డీల్స్ కూడా తేనుంది. ఒన్ డీల్ ఎవ్రీ అవర్ పేరుతో భారీ డిస్కౌంట్లు ఇవ్వనుంది. డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లపై 30శాతం తగ్గింపు ఇవ్వనుంది. డొమిస్టిక్ ఫ్లైట్స్ పై రూ.2వేల 500 వరకు.. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పై రూ.25వేల వరకు ఆఫర్ ఇస్తోంది. ఈ ఆఫర్ పొందాలంటే ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.