Social Media : ఆన్‌లైన్‌ ఫ్రెండ్‌ని నమ్మి వెళితే అఘాయిత్యం చేసి.. అశ్లీల వీడియోలు తీశాడు

ఓ యువతి ఆన్‌లైన్‌ ఫ్రెండ్‌ని నమ్మి 300 కిలోమీటర్లు వెళితే స్నేహితులతో కలిసి అత్యాచారం చేసి ఆ ఘోరాన్ని తమ ఫోన్లలో బంధించారు.

Social Media : ఆన్‌లైన్‌ ఫ్రెండ్‌ని నమ్మి వెళితే అఘాయిత్యం చేసి.. అశ్లీల వీడియోలు తీశాడు

Social Media

Updated On : September 11, 2021 / 6:47 PM IST

Social Media : సోషల్ మీడియాలో పరిచయమైన వారిని నమ్మి కొందరు దారుణంగా మోసపోతున్నారు. డబ్బులతోపాటు, కొందరు అఘాయిత్యాలకు కూడా గురవుతున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన వారిచేతిలో మోసపోతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా కేరళలో ఓ యువతి తన సోషల్ మీడియా స్నేహితుడి చేతిలో దారుణంగా మోసపోయి ఆసుపత్రి పాలైంది.

Read More : Gold Theft : స్నేహితుడి కోసం 750 గ్రాముల బంగారం చోరీచేసిన బాలిక

వివరాల్లోకి వెళితే.. దక్షిణ కేరళలోని కొల్లాంకు చెందిని ఓ యువతికి దాదాపు రెండేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో కోజికోడ్‌కు చెందిన అనాస్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం స్నేహంగా మారింది. తరచూ ఫోన్ మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలోనే గురువారం కోజికోడ్‌ కి రావాలని అనాస్ సదరు యువతిని బలవంతం చేశాడు. అతడిని నమ్మిన యువతి కొల్లాం నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోజికోడ్‌ కి వెళ్ళింది. ఆమెను రిసీవ్ చేసుకున్న అనాస్ ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత తన స్నేహితులకి ఫోన్ చేసి ఫ్లాట్‌కు పిలిపించాడు.

ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించి.. ఆ తర్వాత డ్రగ్స్ ఇచ్చి ఒకరితర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను తమ ఫోన్ లో బంధించారు. ఈ సమయంలోనే సదరు యువతి ఊపిరి తీసుకోవడంలో సమస్య వచ్చింది. ఆయాసపడుతుండటంతో భయపడిన అనాస్ అతడి ముగ్గురు స్నేహితులు ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఆమెను గమనించిన ఆసుపత్రి సిబ్బంది లోపలికి తీసుకెళ్లి వైద్యం చేశారు. అనంతరం వైద్యులు ప్రశ్నించడంతో జరిగిన విషయం చెప్పింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Read More : Girl body : సగం కాలిన బాలిక శవాన్ని బయటకు తీసి పూజలు..ఎందుకంటే

ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు యువతి నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అనాస్ ను గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనాస్ స్నేహితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జరిగిన విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించినట్లు యువతి స్టేట్‌మెంట్ లో తెలిపింది. ఇక మిగిలిన ముగ్గురు నిందితుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.