White Fungus Patna : పాట్నాలో నలుగురికి వైట్ ఫంగస్

బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్ మైకోసిస్) తో పోరాడుతున్న భారత్ కు మరో ముప్పు పొంచి ఉన్నట్టు పరిస్థితులు కనబడుతున్నాయి.. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో వైట్ ఫంగస్ రోగులను వైద్యులు గుర్తించారు.

White Fungus Patna : పాట్నాలో నలుగురికి వైట్ ఫంగస్

Patna White Fungus

Updated On : May 20, 2021 / 1:37 PM IST

White Fungus Patna:బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్ మైకోసిస్) తో పోరాడుతున్న భారత్ కు మరో ముప్పు పొంచి ఉన్నట్టు పరిస్థితులు కనబడుతున్నాయి.. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో వైట్ ఫంగస్ రోగులను
వైద్యులు గుర్తించారు. ఇది బ్లాక్ ఫంగస్ కంటే ప్రాణాంతకమని నిపుణులు భావిస్తున్నారు. పాట్నాకు చెందిన నలుగురు వ్యక్తులు కొద్దిరోజుల కిందట వైట్ ఫంగస్ బారిన పడినట్టు తెలిపారు. ఊపిరితిత్తుల సంక్రమణకు వైట్ ఫంగస్ (కాన్డిడోసిస్) ప్రధాన కారణమని చెబుతున్నారు. ఊపిరితిత్తులతో పాటు, చర్మం, గోర్లు, నోటి లోపలి భాగం, కడుపు మరియు పేగు, మూత్రపిండాలు, జననేంద్రియాలు, మెదడు మొదలైన వాటికి కూడా ఇది సోకుతుందని వెల్లడించారు.

పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పిఎంసిహెచ్) లోని మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఎస్ఎన్ సింగ్ ప్రకారం, నలుగురు రోగులకు కోవిడ్ -19 లక్షణాలు ఉన్నాయి. కానీ వారు కరోనాతో కాకుండా తెల్లటి ఫంగస్ బారిన పడ్డారని తెలిపారు. రోగులలో మూడు కరోనా టెస్ట్ లు.. రాపిడ్ యాంటిజెన్, రాపిడ్ యాంటీబాడీ మరియు ఆర్టీ-పిసిఆర్ పరీక్షలు నెగటివ్ గా ఉన్నాయని అన్నారు.