fire in Army vehicle.. Four Jawans Died : ఆర్మీ వాహనంలో మంటలు, నలుగురు జవాన్లు మృతి

ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగి నలుగురు జవాన్లు మృతి చెందారు.

fire in Army vehicle.. Four Jawans Died : ఆర్మీ వాహనంలో మంటలు, నలుగురు జవాన్లు మృతి

fire in Army vehicle.. Four Jawans Died

Updated On : April 20, 2023 / 4:48 PM IST

fire in Army vehicle.. Four Jawans Died : పూంచ్-జమ్ము హైవేపై వెళ్తున్న ఓ ఆర్మీ వాహనంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలు నలుగురు జవాన్లు మంటల్లో సజీవంగా దహనమైపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. జవాన్లతో వెళ్తున్న వాహనం పూంచ్ జిల్లా తోటగలి గ్రామ సమీపంలో రాగానే ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే వాహనం మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమై తప్పించుకుందామనేలోపే ఆ మంటలకు ఆహుతి అయిపోయారు నలుగురు జవాన్లు.

తప్పించుకోవటానికి వీలు లేకపోవటంతో నలుగురు జవాన్లు వాహనంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్గటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు,ఆర్మీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కానీ ఆర్మీ వాహనంలో మంటలు వ్యాపించటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా..2022 డిసెంబర్‌లో కూడా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఇండియన్ ఆర్మీ ట్రక్‌కు ఇటువంటి ప్రమాదానికే గురి అయ్యింది. ఉదయ్‌పూర్‌లోని మిలిటరీ స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. 2021లో కూడా ఆర్మీ వెహికిల్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.