Article 370 : రద్దు చేసి నేటితో నాలుగేళ్లు పూర్తైంది.. ఇప్పుడు జమ్మూ కశ్మీర్ ఎలా ఉంది?

ఆర్టికల్ 370 రద్దు విషయమై కశ్మీర్ నేతలు ఎప్పటి నుంచో వ్యతిరేక గొంతు వినిపిస్తున్నప్పటికీ.. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బుధవారం (ఆగస్టు 2న) ఈ విషయమై విచారణ ప్రారంభించింది

Article 370 : రద్దు చేసి నేటితో నాలుగేళ్లు పూర్తైంది.. ఇప్పుడు జమ్మూ కశ్మీర్ ఎలా ఉంది?

Updated On : August 5, 2023 / 5:20 PM IST

Article 370 Revocation: ఉగ్రదాడులు, పౌరుల నిరసనలు, తిరుగుబాటుదారుల కార్యాలాపాలు వంటి వాటితో ఎప్పుడూ అల్లకల్లోలంగా కనిపించే జమ్మూ కశ్మీర్.. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ప్రశాంతంగా ఉందని ఆ రాష్ట్ర అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) విజయ్ కుమార్ 2022 ఆగస్టు 5న తెలిపారు. ఆర్టికల్ 370 మూడేళ్లైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 5, 2019 (ఆర్టికల్ 370 రద్దైన తేదీ) నుంచి జమ్మూ కశ్మీర్ లో భద్రతా దళాల కాల్పుల్లో ఏ ఒక్క పౌరుడు గాయపడలేదని, అలాగే ఎన్‭కౌంటర్ జరిగిన ప్రదేశాల్లో రాళ్లు రువ్వే సంఘటనలు కనపించలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవంలో మాత్రం పరిస్థితి వేరేలా కనిపిస్తోంది.

Pakistan : పాకిస్థాన్‌లో చీరల కోసం కొట్టుకున్నమహిళలు .. తుపాకులతో భర్తల హల్ చల్

పోలీసు డేటాలోని సమాచారం మరో విధంగా కనిపిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం నాటి నుంచి పోయిన ఏడాది ఆగస్టు వరకు 174 మంది పోలీసులు, 110 మంది పౌరులు వివిధ ఘటనల్లో మరణించారట. ఆర్టికల్ 370 రద్దుకు ముందు 2016 ఆగస్టు 5 నుంచి 2019 ఆగస్టు 4 వరకు అదే మూడేళ్లలో 290 మంది పోలీసులు మరణించారని పోలీసు డేటా చెప్తోంది. ఆర్టికల్ 370 రద్దుకు పూర్వం మూడేళ్లలో 930 ఉగ్ర ఘటనలు నమోదు కాగా, రద్దు అనంతరం మూడేళ్లలో 617 ఉగ్ర ఘటనలు జరిగినట్లు పేర్కొన్నారు.

worlds Richest woman : ఏకైక మహిళా చక్రవర్తి .. అందంలోనే కాదు ప్రపంచలోనే అత్యంత ధనవంతురాలు

ఇక ఆర్టికల్ 370 రద్దు విషయమై కశ్మీర్ నేతలు ఎప్పటి నుంచో వ్యతిరేక గొంతు వినిపిస్తున్నప్పటికీ.. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బుధవారం (ఆగస్టు 2న) ఈ విషయమై విచారణ ప్రారంభించింది. సంబంధిత వ్యాజ్యాలపై రోజువారీ విచారణ చేపట్టనున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఐపీఎస్​ అధికారి షా ఫైజల్​, సామాజిక కార్యకర్త షెహ్లా రషీద్​లు వేసిన ఈ పటిషన్ మీద ప్రస్తుతం విచారణ సాగుతోంది.

Toshakhana List: ఒక్క ఇమ్రాన్ ఖానే కాదు.. తోషాఖానా నుంచి బహుమతులు తీసుకున్న పాకిస్తాన్ మాజీ అధినేతలు, కుటుంబ సభ్యుల మొత్తం చిట్టా విప్పిన ప్రభుత్వం

జమ్మూ కశ్మీర్‭కు కల్పించిన ప్రత్యేక హోదా అయిన ఆర్టికల్ 370ని 2019లో ఇదే రోజున పార్లమెంట్ రద్దు చేసింది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఈ ఆర్టికల్ రద్దు అనంతరం కశ్మీర్ రెండు భాగాలుగా విడిపోయింది. లధాఖ్ ప్రాంతం పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మారిపోగా.. మిగిలిన జమ్మూ కశ్మీర్‭ను అదే పేరుతో కొనసాగిస్తూ అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. పరిస్థితులు సద్దుమణిగాక రాష్ట్ర హోదా ఇస్తామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అది ఆచరణలోకి రాలేదు.