Arvind Kejriwal: భారీ ప్రకటన చేసిన సీఎం.. ప్రభుత్వ స్కూల్లో చదివే వారికి ఫ్రీ బస్
ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇలా తయారు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే సీఎం భారీ ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆయన ప్రకటించారు

Punjab: అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో విద్యవ్యవస్థపై మంచి అభిప్రాయాలే వస్తుంటాయి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అవలంభించిన విధానాలపై ప్రశంసలు అనేకం వస్తుంటాయి. ఈ పరంపరలో కేజ్రీవాల్ మరో కొత్త నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఇది పంజాబ్ రాష్ట్రంలో అమలుపై ఆయన చెప్పారు. ఢిల్లీలో అమలు గురించి స్పష్టంగా తెలియదు.
UP Roadways: 25 మంది కంటే తక్కువ ప్రయాణికులు ఉంటే బస్సు కదలదు.. ఆర్టీసీ కొత్త నిర్ణయం
బుధవారం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ పట్టణంలో నిర్మించిన ‘స్కూల్ ఆఫ్ ఎమినెన్స్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దామని అన్నారు. ఢిల్లీ తర్వాత ఇప్పుడు భగవంత్ మాన్ ప్రభుత్వం పంజాబ్‌లో అదే విద్యా విప్లవాన్ని ప్రారంభించినందుకు తాను సంతోషిస్తున్నానని అన్నాను. ప్రభుత్వం నిర్మించిన పాఠశాలలో ఉన్న సదుపాయాలు అమృత్‌సర్‌లోని ఏ ప్రైవేట్ పాఠశాలలోనూ లేవని కేజ్రీవాల్ అన్నారు.
ఈ పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని పంజాబ్‌లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇలా తయారు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే కేజ్రీవాల్ భారీ ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు 30 కిలోమీటర్ల పరిధిలో నివసించే పిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. వీలైనంత తొందరలోనే దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్, ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది. అయితే కేజ్రీవాల్ చేసిన ఈ ప్రకటన పంజాబ్ తో పాటు ఢిల్లీకి కూడా వర్తిస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.