Hair Treatment Camp : ఎంత పని జరిగిందిరా అయ్యా.. బట్టతలపై జుట్టు మొలుస్తుందని ఆ నూనె వాడారు.. చివరికి ఇలా..
బట్టతల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఎగిరి గంతేశారు. కానీ,

Hair Treatment Camp : వారంతా బట్టతల బాధితులు. తల మీద వెంట్రుకలే లేవు. బట్టతలతో చాలా బాధలు పడుతున్నారు. మరికొందరు జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. నెత్తి మీద వెంట్రుకలు రాలిపోతున్నాయని మదనపడిపోతున్నారు. ఇంతలో.. జుట్టు రాలే సమస్యకు పరిష్కారం చూపిస్తాము, మీ బట్టతలపై మేము జుట్టు మొలిపిస్తాముని చెప్పగా వారు ఎగిరి గంతేశారు. ఆహా భలే మంచి అవకాశం వచ్చిందని సంతోషపడిపోయారు. తాము ఫ్రీగా ఇచ్చే నూనె తలకు రాసుకుంటే జుట్టు రావడం ఖాయమని చెబితే గుడ్డిగా నమ్మేశారు. వారు ఇచ్చిన నూనెను తలకు రాసుకున్నారు. కట్ చేస్తే.. నెత్తి మీద వెంట్రుకలు రావడం మాట అటుంచితే.. అనారోగ్యం బారిన పడ్డారు. ఆసుపత్రి పాలయ్యారు. కళ్లలో మంటలతో అల్లాడిపోయారు.
పంజాబ్ లోని సంగ్రూర్ లో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉచిత జట్టు చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. మేము ఇచ్చే నూనె వాడితే మీ బట్టతలపై జుట్టు రావడం ఖాయమని ప్రచారం చేశారు. దాంతో బట్టతల బాధితులంతా క్యూ కట్టారు. వాళ్లు చెప్పింది నిజమేనని నమ్మేశారు. వాళ్లు చెప్పినట్లే నూనె వాడారు.
అయితే, వారు చెప్పింది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. ఆ నూనె వాడిన 67 మంది ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రి పాలయ్యారు. కళ్లలో మంటలతో అల్లాడిపోయారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. శిబిరం నిర్వహించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఎలాంటి నైపుణ్యం, అనుమతి లేకుండా వారు శిబిరం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
సంగ్రూర్‌లోని కాళీ దేవి మందిర్‌లో నిర్వహించిన ఉచిత జుట్టు చికిత్స శిబిరానికి అనేకమంది హాజరయ్యారు. వారిలో సుమారు 65 మంది ఆసుపత్రి పాలయ్యారు. కళ్లలో మంట లక్షణాలతో స్థానిక సివిల్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నారు.
Also Read : స్టార్ బక్స్ కి బిగ్ షాక్.. రూ.432 కోట్లు కట్టాల్సిన పరిస్థితి.. టీ కప్ మూత లూజ్ గా పెట్టినందుకు..
బట్టతల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంతా ఆశపడ్డారు. కానీ, శిబిరం నిర్వాహాకులు ఇచ్చిన నూనెను రాసుకుని అనారోగ్యం బారినపడ్డారు. చికిత్సలో భాగంగా వారు ఇచ్చిన నూనెను తలకు రాసుకున్నారు. ఆ తర్వాత తలను కడిగేసుకున్నారు. అంతే, ఒక్కసారిగా కళ్లు ఎరుపెక్కాయి. కళ్లలో మంటలతో తీవ్రంగా బాధపడ్డారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఈ శిబిరాన్ని నిర్వహించారు. దీనికి సుమారు వెయ్యి మంది వరకు హాజరయ్యారు. రంగంలోకి దిగిన వైద్య శాఖ అధికారులు దర్యాఫ్తు జరుపుతున్నారు. అసలేం జరిగింది? వారు ఇచ్చిన నూనె ఏంటి? అందులో ఏం కలిపారు? కళ్లు ఎరుపుగా మారి మంటలు ఎందుకు వచ్చాయి? అనేదానిపై విచారణ చేస్తున్నారు.
Also Read : వావ్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. 20వేల లోపు ప్రైస్‌లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మీకోసం..
పాపం.. బట్టతల బాధితులు తాము ఒకటి తలిస్తే.. అక్కడ మరొకటి జరిగింది. తల మీద జుట్టు మొలుస్తుందని ఆశపడితే.. కళ్ల సమస్య వచ్చి పడింది. జుట్టు రాలే సమస్యకు పరిష్కారం చూపిస్తామనో, బట్టతలపై జుట్టు మొలిపిస్తామనో ఎవరైనా చెబితే గుడ్డిగా నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎవరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మితే ఇదిగో ఇలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు.