Starbucks : స్టార్ బక్స్ కి బిగ్ షాక్.. రూ.432 కోట్లు కట్టాల్సిన పరిస్థితి.. టీ కప్ మూత లూజ్ గా పెట్టినందుకు..

సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇంతటి ఘోరం జరిగిందంటూ స్టార్​బక్స్​పై కేసు వేశాడు మైఖల్ గార్సియా.

Starbucks : స్టార్ బక్స్ కి బిగ్ షాక్.. రూ.432 కోట్లు కట్టాల్సిన పరిస్థితి.. టీ కప్ మూత లూజ్ గా పెట్టినందుకు..

Updated On : March 19, 2025 / 7:46 PM IST

Starbucks : చిన్నపాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. టీ కప్ మూత ఆ ప్రముఖ కాఫీ హౌస్ కంపెనీ కొంప ముంచింది. టీ కప్ మూత లూజ్ గా పెట్టినందుకు.. ఏకంగా 432 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.

స్టార్​బక్స్​ ఔట్​లెట్​లో ఓ డెలివరీ డ్రైవర్​ మీద వేడి వేడి టీ పడింది. ఈ ఘటనలో అతడి ప్రైవేట్ పార్ట్స్ కు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. దాంతో అతను కేసు వేశాడు. ఈ కేసులో అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. బాధితుడికి 432 కోట్ల రూపాయలు చెల్లించాలని స్టార్ బక్స్ ను కాలిఫోర్నియా జ్యూరీ ఆదేశించింది. కవర్ వదులుగా ఉండటం వల్ల వేడి టీ ఒలికి మీద పడింది. ఈ ఘటనలో థర్డ్ డిగ్రీ కాలిన గాయాలకు గురైన డెలివరీ డ్రైవర్‌కు 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కాలిఫోర్నియా జ్యూరీ స్టార్‌బక్స్‌ను ఆదేశించింది.

Also Read : మోదీ మన్ కీ బాత్.. ఈ జర్మనీ అమ్మాయి దశ మార్చేసింది..

ఫిబ్రవరి 2020లో ఈ ఘటన జరిగింది. వేడి వేడి టీ మీద పడటంతో ఆ వ్యక్తి జననాంగాలకు గాయమైంది. నరాలు దెబ్బతిన్నాయి. అతడు చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చర్మాన్ని మార్చాల్సి వచ్చింది.

అతడి పేరు మైఖల్ గార్సియా. డెలివరీ డ్రైవర్. 2020 ఫిబ్రవరి 8న మైఖల్​ గార్సియా ఆర్డర్​ పిక్​ చేసుకోవడానికి లాస్​ ఏంజెల్స్​లోని స్టార్​బక్స్​ ఔట్​లెట్​కి వెళ్లాడు. 3 డ్రింక్స్​ తీసుకున్నాడు. తన తొడల దగ్గర పెట్టుకున్నాడు. అయితే, ఊహించన విధంగా వాటిలో ఒక దానికి మూత​ లూజ్ గా ఉంది. ఆ మూత ఊడి వచ్చేసింది. దాంతో వేడి వేడి టీ అతని తొడల మీద పడింది. ఫలితంగా థర్డ్​ డిగ్రీ గాయాలయ్యాయి. అతడు చాలా ఇబ్బందులు పడ్డాడు. మర్మాంగాల దగ్గర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

కంపెనీ ఔట్ లెట్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇంతటి ఘోరం జరిగిందంటూ స్టార్​బక్స్​పై కేసు వేశాడు మైఖల్ గార్సియా. సిబ్బంది చేసిన తప్పునకు తాను బలి కావాల్సి వచ్చిందని వాపోయాడు. తనకు చాలా నష్టం, కష్టం జరిగిందని ఆవేదన చెందాడు. ఈ ఘటన వల్ల తాను మానసికంగా బాధపడ్డానని, జీవితాన్ని ఎంజాయ్​ చేయలేకపోయాయని బాధపడ్డాడు. తనకు తీవ్రమైన అసౌకర్యం కలిగిందన్నాడు. స్టార్ బక్స్ ఔట్ లెట్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందంటూ కోర్టుకెక్కాడు.

దీనిపై విచారణ జరిపిన లాస్​ ఏంజెల్స్​ కౌంటీ జ్యూరీ మైఖల్​ గార్సియాకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జరిగిన నష్టానికి గాను బాధిత డెలివరీ డ్రైవర్​కి 432 కోట్ల రూపాయలు చెల్లించాలని స్టార్​బక్స్​ ని ఆదేశించింది. కస్టమర్​ భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించలేదంటూ స్టార్ బక్స్ పై సీరియస్ అయ్యింది జ్యూరీ.

Also Read : వావ్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. 20వేల లోపు ప్రైస్‌లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మీకోసం..

జ్యూరీ ఆదేశాలపై స్టార్​బక్స్​ తీవ్రంగా స్పందించింది. ”మిస్టర్ గార్సియా పట్ల సానుభూతి చెందుతున్నాము. కానీ ఈ సంఘటనకు మాదే తప్పు అని జ్యూరీ తీసుకున్న నిర్ణయంతో మేము విభేదిస్తున్నాము. నష్టపరిహారం చాలా ఎక్కువగా ఉందని భావిస్తున్నాము. మా దుకాణాల్లో మేము ఎల్లప్పుడూ అత్యున్నత భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాము” అని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

చివరికి స్టార్‌బక్స్ 30 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించింది. ఈ విషయంలో గోపత్య ఉండాలని కోరింది. అయితే, గార్సియా డిమాండ్ చేసినట్లు క్షమాపణలు చెప్పడానికి తిరస్కరించింది.