Modi Mann Ki Baat : మోదీ మన్ కీ బాత్.. ఈ జర్మనీ అమ్మాయి దశ మార్చేసింది..

నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ లో నా గురించి ప్రస్తావించారని తెలిసి ఆశ్చర్యపోయాను.

Modi Mann Ki Baat : మోదీ మన్ కీ బాత్.. ఈ జర్మనీ అమ్మాయి దశ మార్చేసింది..

Updated On : March 18, 2025 / 9:35 PM IST

Modi Mann Ki Baat : ఇటీవల మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ జర్మనీ అమ్మాయి గురించి ప్రస్తావించారు. సంగీతం ద్వారా భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నారంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. కట్ చేస్తే.. మోదీ మన్ కీ బాత్.. ఆ జర్మనీ అమ్మాయి దశనే మార్చేసింది. వివరాల్లోకి వెళితే.. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. జర్మనీ సింగర్ కాసాండ్రా మే స్పిట్ మెన్ గురించి ప్రస్తావించారు. దృష్టి లోపం ఉన్న కాసాండ్రా తన సంగీతం ద్వారా భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేయడంలో ఆమె అంకితభావాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. అంతే, ఆ తర్వాత మోదీ మన్ కీ బాత్ కారణంగా జర్మనీ అమ్మాయి జీవితమే మారిపోయింది.

“భారతీయ సంస్కృతి పట్ల ప్రపంచానికి ఉత్సుకత పెరుగుతూనే ఉంది. కాసాండ్రా మే వంటి వ్యక్తులు ఈ సాంస్కృతిక మార్పిడిలో విశేషమైన పాత్ర పోషిస్తున్నారు. భారతదేశ వారసత్వం గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని చాటి చెప్పడంలో అంకితభావంతో వారు చేస్తున్న కృషి ప్రశంసనీయం” అంటూ జర్మనీ సింగర్ గురించి ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

దీనిపై జర్మనీ సింగర్ స్పందించారు. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ తన పేరు ప్రస్తావించడం తన జీవితాన్ని మార్చివేసిందన్నారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ఓ వీడియోని పోస్ట్ చేశారు.

”నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ లో నా గురించి ప్రస్తావించారని తెలిసి ఆశ్చర్యపోయాను. దాన్ని నమ్మలేకపోయాను. కొన్ని నిమిషాల పాటు నాకు నోట మాట రాలేదు. అది నా జీవితాన్ని చాలా మార్చివేసింది” అని దృష్టి లోపం ఉన్న జర్మనీ గాయని కాసాండ్రా మే స్పిట్ అన్నారు.

గత సంవత్సరం నాకు ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఫోన్ వచ్చింది. ప్రధాని నన్ను కలవాలనుకుంటున్నారని చెప్పారు. మేము ఆయనను కలిశాము. చాలా సరదాగా మాట్లాడారు. మోదీ చాలా గొప్ప రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆయన ఒక సాధారణ వ్యక్తిలా వ్యవహరించారు. నేను దాన్ని ఒక రోల్ మోడల్ క్వాలిటీగా చూస్తున్నా” అని జర్మనీ సింగర్ అన్నారు.

Also Read : ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కు బ్రేకింగ్ న్యూస్..

మన్ కీ బాత్ 105వ ఎపిసోడ్‌లో కాస్మే గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ.. ఆమెను ప్రశంసించారు. ఆమె రెండు పాటలను పంచుకున్నారు. అందులో ఒకటి విష్ణువుకు అంకితం చేయబడిన సంస్కృత శ్లోకం జగత్ జాన పలం. మరొకటి కన్నడ పాట.

ప్రధానమంత్రి మోదీ ఆమె ప్రతిభను ప్రశంసించారు. “ఎంత మధురమైన స్వరం.. ప్రతి పదం లోతైన భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది. దేవుని పట్ల ఆమెకున్న అనుబంధాన్ని మనం అనుభూతి చెందగలం. ఈ స్వరం జర్మనీకి చెందిన ఒక కుమార్తెది అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు” అని ప్రధాని మోదీ చెప్పారు.

”ఎంత మధురమైన స్వరం… ప్రతి పదంలో మధురం. భావోద్వేగాలను అనుభూతి చెందుతారు. దేవుని పట్ల ఆమెకున్న ప్రేమను మనం అనుభూతి చెందుతాము” అని ప్రధాని మోదీ ప్రశంసించారు. కాసిడీ అనే రంగస్థల పేర్లతో ప్రదర్శన ఇచ్చిన కాసాండ్రా మే స్పిట్మాన్.. తమిళ భక్తి పాటలను ఎంతో హృదయపూర్వకంగా ఆలపించి విస్తృత గుర్తింపు పొందారు.

హిందీ, మలయాళం, తమిళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీతో సహా అనేక భారతీయ భాషలలో ఆమె ప్రతిభను చూపించారు. అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు. సంస్కృతం, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, అస్సామీ, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ భాషలలో అనేక పాటలు పాడారు. సంస్కృతం, తమిళం, హిందీ, ఉర్దూ, మరాఠీ, మలయాళం, కన్నడ భాషలలో ఆమె ఉచ్చారణకు పెద్ద ఎత్తున ప్రశంసలు అందాయి.

Also Read : షారుక్ ఖాన్ టు టామ్ క్రూజ్.. చంద్రునిపై భూమిని కలిగి ఉన్న ప్రముఖులు వీరే..

“నా గురించి ప్రస్తావించినందుకు ఆయనకు చాలా కృతజ్ఞలు. నా పాటను ఇంతగా ఇష్టపడతారని, భారతదేశం పట్ల నా ప్రేమను గుర్తిస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా” జర్మనీ సింగర్ కాస్మే అన్నారు. తాను సంగీతం, ఆధ్యాత్మికతను ప్రేమిస్తున్నా అన్న కాస్మే.. భారతదేశాన్ని కూడా ప్రేమిస్తున్నట్లు చెప్పారు.