Alert For SBI Credit Cardholders : ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కు బ్రేకింగ్ న్యూస్..

ఈ కార్డ్ హోల్డర్లు ప్రస్తుతం Swiggyలో చేసే కొనుగోళ్లపై 10X రివార్డ్ పాయింట్లు పొందుతున్నారు.

Alert For SBI Credit Cardholders : ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కు బ్రేకింగ్ న్యూస్..

Updated On : March 18, 2025 / 8:10 PM IST

Alert For SBI Credit Cardholders : మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందా? అయితే, ఈ వార్త మీ కోసమే. క్రెడిట్ కార్డ్ కలిగిన వారికి బిగ్ అలర్ట్. అదేంటంటే.. రివార్డ్ పాయింట్స్ కు సంబంధించి కోత పెట్టింది ఎస్బీఐ కార్డ్స్. రివార్డ్ పాయింట్ల ప్రోగ్రామ్‌లో సవరణలను ప్రకటించింది. కొన్ని కార్డులపై ఇక నుంచి మునుపటి కంటే తక్కువ రివార్డ్ పాయింట్లను పొందుతారు. స్విగ్గీ, ఎయిరిండియా టికెట్‌ బుకింగ్స్ పై లభించే రివార్డ్ పాయింట్స్ లో కోత పెట్టింది ఎస్బీఐ కార్డ్స్. స్విగ్గీలో ఆన్ లైన్ ఖర్చు (మార్చి 31, 2025 నుండి అమలు), ఎయిరిండియా టికెట్ల కొనుగోళ్లపై (ఏప్రిల్ 1, 2025 నుండి అమలు) లభించే రివార్డ్ పాయింట్లను కుదించింది.

ఈ కొత్త నియమాలు ఏయే కార్డులకు వర్తిస్తాయి?
* SimplyCLICK SBI కార్డ్
* ఎయిర్ ఇండియా SBI ప్లాటినం క్రెడిట్ కార్డ్
* ఎయిర్ ఇండియా SBI సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్
ఈ కార్డ్ హోల్డర్లకు వచ్చే నెల నుంచి ప్రయోజనాల్లో కోత పడనుంది.

Also Read : షాకింగ్‌.. పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

SimplyCLICK SBI కార్డ్ : Swiggyలో రివార్డ్ పాయింట్ల కోత..
ఈ కార్డ్ హోల్డర్లు ప్రస్తుతం Swiggyలో చేసే కొనుగోళ్లపై 10X రివార్డ్ పాయింట్లు పొందుతున్నారు. ఇది ఆహార డెలివరీ ఖర్చులకు గణనీయమైన ప్రోత్సాహకం. కాగా, ఏప్రిల్ 1, 2025 నుండి 5X రివార్డ్ పాయింట్లు మాత్రమే పొందుతారు.

కాగా అపోలో 24×7, బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్‌, డొమినోస్‌, మింత్రా, నెట్‌మెడ్స్‌, యాత్ర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చేసే ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు మాత్రం ఎప్పటిలానే 10X రివార్డులు పొందుతారు.

ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినమ్‌ క్రెడిట్‌ కార్డ్ : ఈ కార్డు హోల్డర్లు ఇప్పటివరకు ఎయిర్ ఇండియా టికెట్‌ బుకింగ్స్ పై ప్రతి 100 రూపాయల ఖర్చుకు గాను 15 రివార్డ్ పాయింట్లు పొందుతున్నారు. ఎయిర్ ఇండియా మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోళ్లకు ఈ రివార్డులు వర్తిస్తాయి. అయితే, మార్చి 31 నుంచి 5 రివార్డు పాయింట్లు మాత్రమే అందుతాయని ఎస్‌బీఐ కార్డ్స్‌ తెలిపింది.

ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ : ఈ కార్డు కలిగిన వారు ప్రస్తుతం ఎయిర్ ఇండియా టికెట్‌ బుకింగ్‌పై ప్రతి 100 రూపాయల ఖర్చుకు గాను 30 రివార్డ్ పాయింట్లు పొందుతున్నారు. మార్చి 31 నుంచి ప్రతి 100 రూపాయలకు 10 రివార్డ్ పాయింట్లు మాత్రమే లభిస్తాయని ఎస్బీఐ కార్డ్స్‌ తెలిపింది. కాగా.. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా చేసే లావాదేవీలకు మాత్రమే ఈ రివార్డులు లభిస్తాయని గుర్తించాలి.