Karnataka New Restrictions : ఒమిక్రాన్ టెన్షన్..న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్,ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు

Karnataka New Restrictions : ఒమిక్రాన్ టెన్షన్..న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

Karnataka

Updated On : December 21, 2021 / 8:29 PM IST

Karnataka New Restrictions :  కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్,ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు బసవరాజ్ బొమ్మై సర్కార్ మంగళవారం ప్రకటించింది.

డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగంగా జరిగే వేడుకలను నిషేధించింది. భౌతికదూరం తప్పనిసరిగా పాటిస్తూ పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. వ్యాక్సిన్ వేసుకోనివారు పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. క్లబ్‌లు, పబ్‌లలో డీజేలు, ప్రత్యేక ఈవెంట్‌లు అనుమతించబడవు. పబ్ లలో ప్రవేశం 50 శాతం సామర్థ్యానికి పరిమితం చేయబడింది. రాష్ట్రంలో ఎక్కడా పెద్ద ఎత్తున పార్టీలను అనుమతించడం లేదని ప్రభుత్వం సృష్టం చేసింది.

అపార్ట్‌మెంట్‌లలో డీజేల వినియోగంపై కూడా నిషేధం విధించింది. అంతర్గత ప్రదేశాల్లో 50శాతం సామర్థ్యంతో వేడుకలకు అనుమతినిచ్చింది. మంగళవారం అధికారులు మరియు కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటాన్ని నిషేధిస్తున్నామని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై తెలిపారు.డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సృష్టం చేశారు. ఇక,కర్ణాటకలో ఇప్పటివరకు 19 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

ALSO READ MP Derek O’Brien : పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి మరో ఎంపీ సస్పెండ్