Frogs Divorced : ‘విడాకులు’ తీసుకుంటున్న ’కప్పల జంట’..!
పెళ్లి చేసుకున్న కప్పల జంట విడాకులు తీసుకుంటున్నాయి.

Frogs Divorced
Frogs Divorced : వర్షాలు కురవకపోతే కరవు తాండవిస్తుంది. అదే వర్షాలు తక్కువగా కురిసినా కష్టమే..ఎక్కువ కురిసినా కష్టమే. వర్షాలు కరవకపోతే గ్రామాల్లో ‘కప్పలకు పెళ్లి’చేస్తారు. అవే వర్షాలు ఎక్కువగా కురిస్తే అదేనండీ భారీ వర్షాలు కురిసి వరదలు ఉప్పొంగి గ్రామాలను ముంచేసే పరిస్థితి వస్తే ‘పెళ్లి చేసిన కప్పలను విడదీస్తారు’. అంటే ఆ కప్పలకు విడాకులు ఇస్తారు. కప్పలకు పెళ్లి చేయటానికి వరణుడే కారణం..వాటికి విడాకులకు కూడా వరుణుడే కారణం కావటం వింతనే చెప్పాలి. ఇటువంటి వింత నమ్మకాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. కప్పలకు పెళ్లి చేయటం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ పెళ్లి చేసిన కప్పలకు విడాకులు ఇస్తారనే విషయం మాత్రం పెద్దగా తెలియదు. అటువంటి ‘కప్పల విడాకులు’గురించి తెలుసుకుందాం..
భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో.. ముఖ్యంగా గ్రామాల్లో నివసించే ప్రజలు.. వర్షాలు కురవటం ఆలస్యం అయితే రెండు కప్పలను (ఆడ మగ)పట్టుకుని స్థానిక సంప్రదాయం ప్రకారం వాటికి పెళ్లి చేస్తారు. ఊరంతా వాటిని ఊరేగిస్తారు. ఆ తరువాత వాటిని దగ్గర్లోని చెరువులల్లో విడిచి పెడతారు. ఇలా చేయడం ద్వారా వరుణ దేవుడు కరుణించి.. వర్షాలు కురుస్తాయని ప్రజలు నమ్ముతారు. అయితే కొన్ని ప్రాంతాల్లో.. కప్పలకు విడాకులు కూడా ఇస్తారు. ముఖ్యంగా భోపాల్ లో ఈ కప్పల విడాకుల పద్ధతి భలే వింతగా ఉంటుంది. రెండు కప్పలను పట్టుకుని వాటిలో ఆడకప్పకు ఓ రంగం దుస్తులు..మగ కప్పకు వేరే రకం దుస్తులు వేస్తారు. తరువాత ఆడ కప్పకు పసుపు కుంకుమ పెడతారు. కాసేపటికి వాటిని వేరు వేరు చెరువుల్లో వేస్తారు. అంటే పెళ్లి చేసినప్పుడు ఒకే చెరువులో వదిలిస్తే..విడాకులు తరువాత వేరు వేరు చెరువుల్లో వదులుతారు.
వర్షాలు అవసరానికి మించి దంచి కొడితే.. పంటలు పాడయ్యే అవకాశం ఉంటుంది. దీంతో కప్పలకు పెళ్లి చేసిన ప్రజలే వాటికి విడాకులు ఇస్తారు. ఎడతెరిపి లేకుండా కురిసే సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు.. రెండు కప్పలను పట్టుకుని, స్థానిక సంప్రదాయాల ప్రకారం వాటికి విడాకులు ఇస్తారు. పెళ్లి సమయంలో రెండు కప్పలను ఒకే చెరువులో వదిలేస్తే.. విడాకుల ప్రక్రియలో మాత్రం.. రెండింటినీ వేరు వేరు చెరువుల్లో వదిలేసి విడదీస్తారు.