Food in News papers : న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన ఆహారం తింటున్నారా..? ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక

న్యూస్ పేపర్లలో ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే.ఇళ్లల్లో కూడా కొంతమంది మహిళలు స్నాక్స్ తయారు చేసేసమయంలో నూనెలో వేగించాక వడలు,బజ్జీలు వంటివి వేపిన తరువాత తీసి వాటిలో నూనె పీల్చుకోటానికి న్యూస్ పేపర్లు మీద వేస్తుంటారు. ఇది కూడా చాలా ప్రమాదం.

Food in News papers : న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన ఆహారం తింటున్నారా..? ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక

Food in News papers FSSAI  Worn

Updated On : September 28, 2023 / 11:00 AM IST

Food in News papers FSSAI  Worn : రోడ్డు పక్కన బళ్లమీద పునుగులు, మిర్చి బజ్జీలు,వడలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ రుచి ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఉండదంటారు. స్ట్రీట్ ఫుడ్ తో పాటు చట్నీ రుచి అద్దిరిపోతుందంటే లొట్టలు వేస్తు తింటారు. సాధారణంగా రోడ్డ పక్కన బళ్లమీద అమ్మేవారు స్నాక్స్ గానీ..ఇతర ఆహారాలు న్యూస్ పేపర్లలో పెట్టి ఇస్తుంటారు. ప్యాకింగ్ చేసినా న్యూస్ పేపర్లలోనే చేసి ఇస్తుంటారు. పైగా వేడి వేడి బజ్జీలు, వడలు, పునుగులు న్యూస్ పేపర్లలో ప్యాక్ చేసినవి తింటే చాలా చాలా ప్రమాదం. ఈ విషయాన్ని స్వయంగా ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI ) వెల్లడించింది.

ఇళ్లల్లో కూడా కొంతమంది మహిళలు స్నాక్స్ తయారు చేసేసమయంలో నూనెలో వేగించాక వడలు,బజ్జీలు వంటివి వేపిన తరువాత తీసి వాటిలో నూనె పీల్చుకోటానికి న్యూస్ పేపర్లు మీద వేస్తుంటారు. ఇది కూడా చాలా ప్రమాదం. వేడి వేడి ఆహారాలు గానీ చల్లారిన ఆహారాలు గానీ న్యూస్ పేపర్లలో వేసిన తరవాత..లేదా ప్యాక్ చేసినవి తింటే చాలా ప్రమాదమని హెచ్చిరించింది ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ).

Headphones Increase Bacteria : అతిగా హెడ్ ఫోన్స్ వాడితే.. చెవిలో ఇలా జరుగుతుందని మీకు తెలుసా?

న్యూస్ పేపర్లలో ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టేనని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. వార్త పత్రికల్లో ఆహార పదార్థాలను ప్యాకింగ్‌ చేయడం, భద్రపరచడం ఆరోగ్యానికి మంచిదికాదని.. పేపర్లలో వాడే ప్రింటింగ్‌ ఇంక్‌లో హానికరమైన రసాయనాలు ఉంటాయని, వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వెల్లడించింది. దేశ వ్యాప్తగా కస్టమర్లు, ఆహారాలు అమ్మే వ్యాపారులు పదార్ధాలను ప్యాకింగ్ చేయటానికి న్యూస్ పేపర్లు వాడుతుంటారు. అలాగే పేపర్లలో పెట్టి ఇస్తుంటారు. అలా చేసే వ్యాపారులు వెంటనే అటువంటివి వెంటనే నిలిపివేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది.

తిను బండారాలను ప్యాక్ చేయటానికి న్యూస్ పేర్లు ఎట్టిపరిస్థితుల్లోను వినియోగించరాదని వార్నింగ్ ఇచ్చింది.న్యూస్ పేపర్ల ప్రింటింగ్ కు ఉపయోగించే ఇంకు శరీరంలోకి వెళితే పైగా ఆహార పదార్ధాలతో కలిసి వెళితే మరింత ప్రమాదమని ఆ ఆహారాన్ని ఆ ఇంకు కలుషితం చేస్తుందని తద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని వెల్లడించింది.

ప్రింటింగ్ ఇంకులో సీసం, హెవీ మెటల్స్ తో పాటు పలు కెమికల్స్ ఉంటాయని అవి ఆహారపదార్ధాలతో పాటు శరీరంలోకి వెళితే చాలా ప్రమాదమని వెల్లడించింది. ఈ ఇంకులోని కెమికల్ ఆహారంలోకి ఈజీగా కలిసిపోతుంది. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది వెంటనే ప్రభావం చూపించకపోయినా తరువాత తరువాత పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వెల్లడించింది.

Vitamin D3 : విటమిన్ D3 ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది? విటమిన్ D3 పొందేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు !

న్యూస్ పేపర్లను ఇంటింటికి డెలివరీ చసే సమయంలో పేపర్లు పలు ప్రాంతాల్లో పయనిస్తుంటాయి. అలా ప్రయాణించే సమయంలో పలు రకాల పర్యావరణ పరిస్థితులకు లోనవుతాయి. వాటిపై బ్యాక్టీరియా, వైరస్‌లు చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. క్రిములు చేరతాయి. ఈ విషయాన్ని గమనించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచించింది. ఆహార భద్రత, ప్రమాణాలు అంటే ప్యాకింగ్ వంటి నిబంధనల ప్రకారం నిల్వ చేయటానికి గానీ…ఆహార పదార్ధాలను ప్యాక్ చేయటానికి గానీ న్యూస్ పేపర్లు గానీ లేదా ఇతర ప్రింటింగ్ పేపర్లు గానీ వినియోగించవద్దని హెచ్చరించింది.

ఆహారాల ప్యాకింగ్ లకు న్యూస్ పేపర్లు నిషేధమని వెల్లడించింది. ఆహార పదార్ధాలు చుట్టటానికి..కవర్ చేయటానికి వడ్డించడానికి న్యూస్ పేపర్లను ఉపయోగించకూడాదని అలాగే నూనెలో వేగించిన ఆహారాలను నూనె పీల్చేందుకు పేపర్లు వినియోగించవద్దని సూచించింది. ఆహారాల వ్యాపారులు కస్టమర్ల భద్రను దృష్టిలో పెట్టుకోవాలని వాడేసి న్యూస్ పేపర్లు వినియోగించవద్దని హెచ్చరించింది. వ్యాపారులు కష్టమర్ల ఆరోగ్యం గురించి బాధ్యత వహించాలని FSSAI కోరింది.