Ganesh Chaturthi 2021: వినాయక చవితి సందర్భంగా ఆ గణపతికి రూ.6కోట్ల విలువైన కిరీటం
ఎంతో పురాతనమైనవే కాక చాలా ప్రసిద్ధి చెందిన ముంబై లాల్ బాగ్చా గణేషుడు, పుణెలోని శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి గణపతి మందిరాల్లో వినాయక చవితి సందర్భంగా భారీ ఎత్తున పూజలు జరుగుతాయి.

Halwai Ganapati
Ganesh Chaturthi 2021: వినాయక చవితి అనగానే.. గుర్తుకొచ్చే గణేశ్ సంబరాల్లో ఖైరతాబాద్‌తో పాటు ముంబై కూడా చెప్పుకుంటారు. భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండగ హడావుడి గతేడాది అంతగా కనిపించలేదు. ప్రస్తుతం కేసుల నమోదు అంతగా లేకపోవడంతో గణేశ్ సంబరాలకు అనుమతులొచ్చాయి. మహారాష్ట్రలో ఫుల్ ఫ్యామస్ అయిన ముంబై లాల్ బాగ్చా గణేశ్ కిరీటం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేంతగా అలంకరించారు.
ఎంతో పురాతనమైనవే కాక చాలా ప్రసిద్ధి చెందిన ముంబై లాల్ బాగ్చా గణేషుడు, పుణెలోని శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి గణపతి మందిరాల్లో వినాయక చవితి సందర్భంగా భారీ ఎత్తున పూజలు జరుగుతాయి. ఏటా హల్వాయి గణపతి మందిరంలో మహా భోగ్ పేరిట భారీ ఎత్తున మోదక్‌లు, మిఠాయిలు ప్రసాదంగా నివేదిస్తారు.
ఈ క్రమంలో ప్రస్తుత ఏడాది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తులు హల్వాయి గణపతికి 6 కోట్ల రూపాయల విలువ చేసే 5 కిలోల బంగారు కిరీటాన్ని గణేషుడికి సమర్పించారు. పర్వదినం సందర్భంగా కొత్త దుస్తులు, ఆభరణాలతో అలకరించి.. బంగారు కిరీటం అమర్చారు. దాంతో పాటుగా 21 కేజీల మహాప్రసాదాన్ని సమర్పించారు.
Sai Dharam Tej: యాక్సిడెంట్‌కు గురైన బైక్ విలువెంతో తెలుసా..
కరోనా వ్యాప్తి జరగకూడదనే ఆలయాల్లో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నారు. ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఆన్‌లైన్ దర్శనాలు ప్రారంభించారు. ప్రస్తుతం హల్వాయి గణపతి మందిరంలో కూడా హారతి కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు.