గణేశ్ మండపంలో మందేసి చిందులు..

గణేశ్ ఉత్సవంలో మద్యం ఏరులైపారింది. వినాయక చవితి ఉత్సవంలో భక్తి మాట అటుంచితే..యువకుల చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. తాగారు. తూగారు. నానా బీభత్సం చేశారు. మందు బాటిల్స్ తో డాన్స్ లు వేసి నానా హంగామా సృష్టించారు. వినాయకుడి పూజా మండపంలో యువకులు బీరు తాగుతూ చేసిన డాన్స్ లు చూసినవారంతా మండిపడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలోని మహిధర్‌పుర ప్రాంతంలో 8మంది యువకులు బీరు తాగుతూ డాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.
సూరత్ నగరంలోని గోల్వాడ ప్రాంతంలోని మహీధర గణేశ్ పూజా మండపంలోనే వినాయకుడి విగ్రహం వద్ద 8 మంది యువకులు బీరు తాగుతూ బాలీవుడ్ పాటలకు నృత్యం చేశారు. భక్తిప్రపత్తులతో గణనాధుడికి పూజలు చేయాల్సిన స్థలంలో యువకులు మత్తులో జోగుతూ పాటలు పాడుతూ డాన్స్ లేశారు. ఈ డాన్స్ వీడియో వైరల్ కావడంతో సూరత్ పోలీసులు రంగంలోకి దిగారు. మద్యం తాగుతూ డాన్స్ చేసిన 8 మంది యువకులను గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన గణేశ్ ఉత్సవాల్లో యువకులు హంగామా సంచలనానికి దారి తీసింది.
गुजरात के सूरत में गणपति के भक्तों ने उड़ाया, संस्कृति और कानून दोनो का मखौल। विडीओ में देखिए कैसे शराब बंदी के कानून की धज्जियां उड़ाई जा रही हैं वो भी भगवान की स्थापना के जुलूस में। @indiatvnews @CP_SuratCity @dgpgujarat @GujaratPolice @PradipsinhGuj @ShaileshChampa1 @CMOGuj pic.twitter.com/FQ8jJhQKPA
— Nirnay Kapoor (@nirnaykapoor) September 3, 2019