Hizab :హిజాబ్ వివాదంపై పాక్ విమర్శలు..మా సమస్యను మేం చూస్కుంటాం..మీరు నీతులు చెప్పక్కర్లా

కర్ణాటక హిబాబ్ వివాదంపై పాకిస్థాన్ మంత్రులు చేసిన వ్యాఖ్యలకు..విమర్శలకు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటు కౌంటర్ ఇచ్చారు.హిజాబ్ సమస్య మాది మేం చూస్కుంటాం..మీరు నీతులు చెప్పొద్దు..

Karnataka Hizab issue Asaduddin Owaisi : కర్ణాటకలో చిలికి చిలికి గాలివానగా మారి కోర్టు వరకు వెళ్లిన హిజాబ్ వివాదం భారత్ దాయాది దేహవైన పాకిస్థాన్ వరకు వెళ్లింది. దీన్ని ఆసరాగా చేసుకుని భారత దాయాది దేశం పాకిస్థాన్ విమర్శలు చేసింది. బుర్ఖాపై ఈ ఆంక్షలేంటీ? ఇది వ్యక్తుల ప్రాథమిక హక్కులను కాలరాసే ఆంక్షలు అనీ..ముఖ్యంగా ముస్లిం యువతుల విద్యాహక్కును హరించే ఆంక్షలు అంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read :  Priyanka Gandhi Hijab : బికినీ అయినా, జీన్స్,బుర్ఖా ఏదైనా ధరించే హక్కు మహిళలకు ఉంది

ముస్లిం యువతులను బుర్ఖా ధరించవద్దని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదని..వారిని భయభ్రాంతులకు గురించేయటానికే ఇలాంటి అర్థం పర్థం లేని ఆంక్షలు విధిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.ఇది కచ్చితంగా ముస్లింలను అణచివేసే ఆంక్షలంటూ విమర్శించారు. అలాగే పాకిస్థాన్ సమాచార ప్రసార శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ కూడా కర్ణాటకలో హిబాబ్ వివాదంపై స్పందించారు. ‘అస్థిర నాయకత్వంలో భారతీయ సమాజం వేగంగా పతనావస్థలోకి జారుకుంటోంది‘ అంటూ వ్యాఖ్యానించారు. భారత్ లో ప్రస్తుతం పరిణామాలు భయానకంగా ఉన్నాయని హుస్సేన్ అన్నారు.

Also read : Asaduddin Owaisi: ‘టోపీతో నేను పార్లమెంటుకు వెళ్లినప్పుడు ఆడపిల్లలు హిజాబ్ తో కాలేజికి వెళ్లకూడదా’

పాకిస్థాన్ మంత్రులు అత్యుత్సాహంగా చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత..ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు.పాక్ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. ‘‘
ఇది హిజాబ్ అంశం మా సమస్య మేం చూసుకుంటాం..మేం పరిష్కరించకుంటాం..మాది భారతదేశం దేశం..ఇది మా అంతర్గత వ్యవహారం
దీంతో మీకేమీ సంబంధం లేదు. బాలికల విద్యా హక్కు గురించి మీరా మాకు నీతులు చెప్పేది..బాలికల విద్యను కాలరాసే ఆంక్షలు పెట్టే మీరా మాకు బాలికల విద్య గురించి మాకు పాఠాలు చెప్పేది అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బాలికల విద్యా హక్కు గురించి పోరాడిన మలాలా యూసఫ్ జాయ్ పై పాకిస్థాన్ లోనే దాడి జరిగిందని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తు చేశారు. పాక్ లో జరిగిన దాడి వలనే మలాలా దేశం విడిచిపెట్టాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

Also read : Karnataka Hijab: మ‌హిళ‌ల ధరించే దుస్తులు రెచ్చగొట్టేలా ఉండటం వల్లే అత్యాచారాలు : బీజేపీ ఎమ్మెల్యే

భారత్ లో జరిగే విషయంపై దృష్టిపెట్టేముందు మీదేశంలో ఉన్న సమస్యల గురించి ఆలోచించండీ..ముందు మీ సొంత ఇంటి సమస్యలను చక్కబెట్టుకోండి..మీ దేశంలో మీకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పై దృష్టి పెట్టండీ..ఆ సమస్యలను పరిష్కరించటానికి చూడండి. భారతదేశం మన దేశం, ఇది మన అంతర్గత వ్యవహారం. మా సమస్యల గురించి మాట్లాడేముందు మీ సమస్యల గురించి ఆలోచించండీ అంటూ పాకిస్థాన్ కూడా ఒవైసీ ఘాటు కౌంటర్ ఇచ్చారు.

పాకిస్తాన్ రాజ్యాంగం ముస్లిమేతరులు ప్రధాని కావడానికి అనుమతించదు. పాకిస్థాన్‌కు నా సలహా ఏమిటంటే, ఇధర్ మత్ దేఖో … ఉధర్ హాయ్ దేఖో (ఇటువైపు చూడకండి, మీ స్వంత దేశం వైపు చూడండి)” అని ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఒవైసీ ఘాటు కౌంటర్ ఇచ్చారు.

Also read :  Hijab Row: ‘హిజాబ్ తలనే కప్పి ఉంచుతుంది.. బ్రెయిన్‌ను కాదు’

మహిళలకు హిజాబ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఒవైసీ స్పష్టం చేశారు. ఆ హక్కు పరిరక్షణ కోసమే పోరాటం జరుగుతోందని..హిజాబ్ కోసం పోరాడే వారికి తమ సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటుందని ఒవైసీ మరోసారి స్పష్టంచేశారు. హిజాబ్ కు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని ఒవైసీ విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు