Girl Stabs: దివ్యాంగుడిని కత్తితో పొడిచిన యువతి

చత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో 16ఏళ్ల యువతి దివ్యాంగుడిని కత్తితో పొడిచింది. నడిరోడ్డుపై జరిగిన ఘటనతో స్థానికులు షాక్ కు గురయ్యారు. ఆజాద్ చౌక్ పోలీస్ స్టేషన్ అడిషనల్ సూపరిండెంట్ పోలీస్ కంకలీపరా ప్రాంతంలో ఘటన జరిగినట్లు వెల్లడించారు.

Girl Stabs: దివ్యాంగుడిని కత్తితో పొడిచిన యువతి

Kurnool Murder

Updated On : July 24, 2022 / 10:14 PM IST

 

Girl Stabs: చత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో 16ఏళ్ల యువతి దివ్యాంగుడిని కత్తితో పొడిచింది. నడిరోడ్డుపై జరిగిన ఘటనతో స్థానికులు షాక్ కు గురయ్యారు. ఆజాద్ చౌక్ పోలీస్ స్టేషన్ అడిషనల్ సూపరిండెంట్ పోలీస్ కంకలీపరా ప్రాంతంలో ఘటన జరిగినట్లు వెల్లడించారు.

ఆ టీనేజర్ టూవీలర్ డ్రైవ్ చేస్తూ.. మూగ, చెవిటి వాడైన వ్యక్తి సైకిల్ తొక్కుతుండగా తప్పుకొమ్మంటూ హారన్ కొట్టింది. అతనికి వినపడకపోవడంతో ఎటువంటి రియాక్షన్ రాలేదు. అలా మొదలైన గొడవ హద్దులు దాటడంతో ఆమె కత్తితో దివ్యాంగుడి మెడలో పొడిచింది. అలా ఘటనాస్థలంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

హంతకురాలు మందిర్ హసౌద్ ఏరియా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆమె నుంచి తుపాకీని స్వాధీనపరచుకున్నారు. ఐపీసీ 302 ప్రకారం ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఆజాద్ చౌక్ పోలీసులు తెలిపారు. సోమవారం మైనర్ ను జువైనల్ జస్టిస్ ముందు హాజరుపరచనున్నారు.

Read Also : రూ.500 అప్పు విషయంలో గొడవ-వ్యక్తి హత్య