Visakhapatnam : రూ.500 అప్పు విషయంలో గొడవ-వ్యక్తి హత్య

విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. రూ. 500 అప్పు విషయంలో జరిగిన గొడవలో  అప్పల రెడ్డి అనే వ్యక్తిని రౌడీ షీటర్ శంకర్ హత్య చేశాడు. పెదవాల్తేరు, మునసబు వీధిలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

Visakhapatnam : రూ.500 అప్పు విషయంలో గొడవ-వ్యక్తి హత్య

Vsp Murder

Updated On : July 23, 2022 / 8:21 PM IST

Visakhapatnam :  విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. రూ. 500 అప్పు విషయంలో జరిగిన గొడవలో  అప్పల రెడ్డి అనే వ్యక్తిని రౌడీ షీటర్ శంకర్ హత్య చేశాడు. పెదవాల్తేరు, మునసబు వీధిలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

అప్పల రెడ్డి అనే  వ్యక్తి గతంలో సాయి అనే వ్యక్తి వద్ద 500 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. నిన్న అర్ధరాత్రి సమయంలో అప్పు తీర్చేందుకు వచ్చిన సాయికి అప్పలరెడ్డికి వాగ్వాదం జరిగింది.  దీంతో అప్పల రెడ్డి సాయికి ఇవ్వవలసిన బాకీ తీర్చి క్షమాపణ కూడా అడిగాడు.

అనంతరం  అప్పల రెడ్డి  మోటార్ సైకిల్ పై కూర్చుని మొబైల్ చూసుకుంటున్న సమయంలో సాయి అన్నయ్య, రౌడీ షీటర్ గౌరీ శంకర్ వచ్చి కత్తితో అప్పలరెడ్డి గొంతుకోసి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి విచారణ చేపట్టారు.

మృతుడు అప్పలరెడ్డి కారు  డ్రైవర్ గా పని చేస్తూ రాత్రి పూట మద్యం విక్రయిస్తూ ఉంటాడని తెలిసింది.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.  నిందితుడు, రౌడీషీటర్ గౌరీ శంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయి కోసం గాలిస్తున్నామని విశాఖ ద్వారకా ఏసీపీ మూర్తి తెలిపారు.

Also Read : Monkeypox: పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ