గల్లీ ఫుడ్.. నెత్తికి టోపీ..చేతులకు గ్లౌజ్‌లు ఉండాల్సిందే

మీరు రోడ్లపై వ్యాపారం చేస్తున్నారా…ఆహారం అందించే వ్యక్తి నెత్తికి టోపీ, చేతులకు గ్లౌజ్‌లు ఉండాల్సిందేనంటోంది కేంద్రం. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) మంత్రి రాజేంద్ర షింగ్నే..ఈ మేరకు ఒక సర్క్యూలర్ జారీ చేశఆరు. అంతేగాకుండా..తనిఖీలు పెంచాలని ఆదేశించారు. పారిశుధ్యం, ఆహార శుభ్రత కోసమే ఈ నిబంధనలు పెట్టారు. రోడ్లపై అనేక ఆహారా పదార్థాల స్టాల్స్ ఉన్నాయని, కానీ..పారిశుధ్యం, ఆహార విషయంలో శుభ్రత పాటించడం లేదనే విషయాలు తమ దృష్టికి వచ్చాయని FDAకు చెందిన ఓ అధికారి వెల్లడించారు.
వివిధ నిబంధనలు, సర్య్కూలర్లు ఉన్నా..ప్రమాణాలు పాటించడం లేదన్నారు. ఆహారం అందించే సమయంలో..నెత్తికి టోపీ, చేతులకు గ్లౌజ్‌లు ధరించడం తప్పనిసరి చేయాలని సర్క్యూలర్‌లో ఆదేశించారని తెలిపారు. ఈ నిబంధనలు వచ్చే వారం నాటికి అమలయ్యే అవకాశం ఉందన్నారు. గుట్కాలపై తనిఖీలు నిర్వహించిన ఎఫ్‌డీఏ..కల్తీ చేస్తున్న పాలు, మంచినూనెలపై దృష్టి సారించింది.
ఫిబ్రవరి 12వ తేదీన పాలు, నూనెలను కల్తీ చేస్తున్న కేంద్రాలపై జరిగిన దాడులు..తీసుకున్న చర్యలపై ఓ నివేదికను సమర్పించాలని మంత్రి షింగ్నే..కమీషనర్‌కు సూచించారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006లోని నిబంధనలను పూర్తిగా పాటించేలా చూడాలన్నారు. ఉపయోగించిన టిన్లలో నూనెను నిల్వ చేయడం అనుమతించబడదని, ప్రస్తుతం పాలు, నూనెలను కల్తీ చేస్తున్నారని..ఇదొక పెద్ద సమస్యగా మారిందని అధికారులు వెల్లడించారు. దాడుల్లో భివాండీ నుంచి రూ. 5 కోట్ల రూపాయలు విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అయితే..అధికారుల కొరత ఉంది. 126 పోస్టులు మాత్రమే ఉన్నాయని, వాటిలో 40 ఖాళీలున్నాయన్నారు. త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. FDAకు ఫిర్యాదులు చేయాలని అనుకుంటే..1800 222 365 లేదా 26592361 ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.