Costly Goat: తగ్గేదేలే..! వయస్సు మూడేళ్లు.. ధర రూ. 6లక్షలు..
రాజస్థాన్‌కు చెందిన శంకర కిచన్ అనే రైతు భారీ కాయం కలిగిన మేకపోతును పెంచుతున్నాడు. దీని బరువు 110 కిలోలు ఉంటుంది. మూడేళ్లుగా దీనిని పెంచుతున్నాడు. ఈ మేకపోతు గంభీకరంగా ఉండటమే కాకుండా శరీరంపై ఎలాంటి నల్లటి మచ్చలేకుండా తెల్లగా మెరిసిపోతుంది.

got
Costly Goat: సాధారణంగా మేకలు, గొర్రెలు మనకు అందుబాటులో ఉన్న ధరలోనే ఉంటాయి. అంటే వాటి బరువును బట్టి పదివేల నుంచి 20 వేలు, ఎక్కువ బరువు ఉంటే రూ. 30వేల వరకు పలుకుతాయి. ఉత్తమ జాతికి చెందిన మేకపోతు అయితే కాస్త ధర ఎక్కువగా ఉంటుంది. అదీ లక్ష, అంతకన్నా ఎక్కువ అంటే లక్షన్నర ధర పలుకుతుంది. కానీ, రాజస్థాన్ కు చెందిన ఓ మేకపోతే ఏకంగా రూ. 6లక్షలు పలికింది.
Goat And Sheep Farming : వ్యాపార సరళిలో జీవాల పెంపకంతో మెరుగైన జీవనోపాధి !
రాజస్థాన్‌కు చెందిన శంకర కిచన్ అనే రైతు భారీ కాయం కలిగిన మేకపోతును పెంచుతున్నాడు. దీని బరువు 110 కిలోలు ఉంటుంది. మూడేళ్లుగా దీనిని పెంచుతున్నాడు. ఈ మేకపోతు గంభీకరంగా ఉండటమే కాకుండా శరీరంపై ఎలాంటి నల్లటి మచ్చలేకుండా తెల్లగా మెరిసిపోతుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మథుర సమీపంలో నేషనల్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గోట్స్ (ఎన్ఎస్ఐఎఫ్ఆర్‌జీ) ఆధ్వర్యంలో నేషనల్ గోట్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్ లో శంకర్ తన మేకపోతును బరిలోకి దింపాడు. బరువు విభాగంలో మేకపోతు ప్రథమ బహుమతి పొందింది.
Goat Kneels Down AT Temple : దేవుడికి హారతి ఇస్తుండగా ముందుకాళ్లతో మోకరిల్లిన మేక
నేషనల్ గోట్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది గోట్స్ ఫామ్ యాజమానులు, గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మేకపోతు 110 కిలోలు ఉండటంతో .. మేకపోతుకు ఎలాంటి ఆహారం అందిస్తారు.? దాని జీవనశైలి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను యాజమాని కిషన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇదిలాఉంటే ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన మేకపోతే ఆస్ట్రేలియాలో ఉంది. మర్రకేశ్ అనే పేరు కలిగిన ఈ మేకపోతు 21వేల డాలర్లు (సుమారు 15లక్షలు)పలికి ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన రికార్డును సొంతం చేసుకుంది.