Gold Rate Today : బంగారం ధరల్లో స్వల్ప మార్పు.. స్థిరంగా వెండి

బంగారం ధరలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఈ క్రింది విధంగా

Gold Rate Today : బంగారం ధరల్లో స్వల్ప మార్పు.. స్థిరంగా వెండి

Gold Rate Today

Updated On : August 17, 2021 / 11:07 AM IST

Gold Rate Today : గత 10 రోజుల్లో బంగారం ధరలు 3 రోజులు తగ్గాయి. 4 రోజులు పెరిగాయి. 3 రోజులు స్థిరంగా ఉన్నాయి. గత 10 రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.540 తగ్గింది. అయితే గతేడాది ఆగస్ట్ 17న 22 క్యారెట్ల 10 గ్రాముల నగల బంగారం ధర రూ.51,670 ఉంది. ఇక ప్రస్తుతం రూ.44,010 ఉంది. ఏడాది కాలంలో బంగారం ధర రూ.7,660 తగ్గింది. ఏడాది కాలంలో ఇంత ధర తగ్గడం మొదటిసారి.

నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి1 గ్రాము రూ.4,401 ఉండగా 10 గ్రాములు బంగారం ధర రూ.44,010 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 1 గ్రాము రూ.4,801 ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,010 ఉంది.

మరోవైపు రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గొచ్చని అంతర్జాతీయ సంస్థ యూబీఎస్‌ గ్రూప్‌ ఏజీ భావిస్తోంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు పునరుత్తేజితం అవుతున్నందున, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై పెట్టుబడులు తగ్గే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.

అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కాగా, ఫెడరల్‌ రిజర్వు త్వరలోనే తన భారీ ఉద్దీపనలను క్రమంగా వెనక్కి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గొచ్చని, కమొడిటీ మదుపర్లు నష్టాలు పెరగకముందే బయటకు రావడం మంచిదని యూబీఎస్‌ గ్రూప్‌ ఏజీ సూచిస్తోంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,480 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,160 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,500 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,980గా ఉంది.

 

వెండి ధర నిన్న స్థిరంగా ఉంది. గత 10 రోజుల్లో ధర 6 సార్లు తగ్గగా 2 సార్లు పెరిగింది. రెండుసార్లు స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి వెండి ధర 1 గ్రాము రూ.68.20 ఉంది. 10 గ్రాములు కావాలంటే ధర రూ.682 ఉంది. కేజీ వెండి ధర రూ.68,200 ఉంది. వెండి నగలు కొనుక్కోవాలి అనుకునేవారికి ఇది సరైన టైమే. ఎందుకంటే… జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.68,200 ఉంది. రెండు నెలల కాలంగా ధర రూ.8,600 తగ్గింది. ఐతే ఆగస్ట్ 8 నుంచి వెండి ధర పెరుగుతోంది. మున్ముందు కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.