Gold Prices Today : తగ్గిన బంగారం ధరలు

కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పండుగులు, పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Gold Prices Today : కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పండుగులు, పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి. పసిడి ధరల్లో రోజురోజుకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి.

తాజాగా బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చే వార్త ఇది. పసిడి ధరలు తగ్గాయి. భారత్ లో గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గాయి. ఎంఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.03శాతం తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.47వేల 540గా ఉంది. సిల్వర్ ధరలు కూడా తగ్గాయి. 0.6శాతం తగ్గి కేజీ గోల్డ్ రూ.63వేల 741గా ఉంది. గురువారం దీపావళి ముహురత్ సెషన్ లో గోల్డ్ రూ.600 పెరిగింది. సిల్వర్ ధర కేజీ రూ.1800గా ఉన్న సంగతి తెలిసిందే.

Watermelon Seeds : పుచ్చగింజలు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా?

గ్లోబల్ మార్కెట్స్ లో ఇవాళ గోల్డ్ స్టడీగా ఉంది. ఔన్స్ కు 1,792.74 డాలర్లుగా ఉంది. ఇక సిల్వర్ ఔన్స్ కి 0.1శాతం పడిపోయింది. ఇక ప్లాటినమ్ ఔన్స్ కి 0.2శాతం పెరిగి 1,027.84 డాలర్లుగా ఉంది.

ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఇది కేవలం ధరించే ఆభరణమే కాదు సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఇన్వెస్టర్లు భావిస్తారు. అందుకే, పుత్తడిని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇక భారతీయులకు అత్యంత ప్రీతికరమైంది గోల్డ్. మహిళలు పసిడికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ధర ఎంత పెరిగినా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం ఆపరు.

Heart Attack : అకస్మాత్తుగా గుండెపోటు ఎందుకు వస్తుందంటే?

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల దగ్గరున్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషించారు.

ట్రెండింగ్ వార్తలు