Watermelon Seeds : పుచ్చగింజలు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా?

హైబిపి ఉన్నవారికి పుచ్చగింజలు తినటం వల్ల బీపిని తగ్గించుకోవచ్చు. తలలో ఉన్న చుండ్రుని వదిలించుకోవడానికి ఈ గింజల తో చేసిన నూనె దురదగా ఉంటే మాడుకు రాస్తే చుండ్రు తగ్గించడానికి బాగా పనిచేస్తుంది.

Watermelon Seeds : పుచ్చగింజలు తింటే  జ్ఞాపకశక్తి పెరుగుతుందా?

Watermelon Seeds

Watermelon Seeds : ఎర్రగా కనిపించే పుచ్చకాయ కనిపిస్తే చాలా మందికి నోరూరి పోతుంది. తియ్యగా ఉండే పుచ్చకాయలను ఇష్టంగా తింటారు. ఇందులో ఉండే గింజలను తినేందుకు మాత్రం ఇష్టపడరు. గింజలను పారేస్తారు. అయితే అసలు విషయం ఏటంటే పుచ్చగింజలు తినటం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని చాలా మందికి తెలియదు.

పుచ్చగింజలను కాయ నుండి తొలగించి వాటిని ఎండబెట్టి వేపుకుని తినవచ్చు. అలా కాకుండా మెత్తని పొడిగా మార్చి కూరల్లో కూడా వాడుకోవచ్చు. పుచ్చకాయ గింజల్లో గ్లోబులిన్, అల్బుమిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చేస్తాయి. ఈ గింజల్లో మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉంటాయి. అలాగే విటమిన్ సీ, బీ కాంప్లెక్స్, అమైనా యాసిడ్స్ ఉంటాయి. పుచ్చకాయ మాత్రమే కాకుండా పుచ్చకాయ గింజల వాళ్ళ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే ఈ విత్తనాలు ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి.

వ్యాధి నివారణకు పుచ్చకాయ గింజలు ఉపయోగపడతాయి. ఈ విత్తనాలని ఎడిమా వ్యాధి చికిత్స లో వాడతారు. అలానే పుచ్చకాయ విత్తనాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయ పడుతుంది. అలానే ఈ విత్తనాల తో చేసిన నూనె కి మాయిశ్చరైజర్ గుణాల వల్ల స్కిన్ మాయిశ్చరైజర్ గా వాడతారు. ఇందులో ఓమేగా ఫ్యాటి ఆమ్లములు కూడా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ లేదా తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లను పరిమితుల నుంచి రక్షణ కలగజేస్తుంది.

హైబిపి ఉన్నవారికి పుచ్చగింజలు తినటం వల్ల బీపిని తగ్గించుకోవచ్చు. తలలో ఉన్న చుండ్రుని వదిలించుకోవడానికి ఈ గింజల తో చేసిన నూనె దురదగా ఉంటే మాడుకు రాస్తే చుండ్రు తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడతాయి. డయాబెటిస్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతుంటాయి. అలాంటి వారు ఈ గింజలు తింటే… వీటిలో ఉండే మెగ్నీషియం వల్ల ఇన్సులిన్ సమత్యులత ఏర్పడుతుంది.

జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు ఉంటే ఈ విత్తనాలు బాగా ఉపయోగపడతాయి మధుమేహాన్ని ఎదుర్కోవడానికి కూడా సహాయపడుతుంది. చర్మ సౌందర్యానికి యవ్వనంగా కనిపించడానికి ఈ విత్తనాలతో లినోలిక్ కొలియాక్ వంటి కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి ఇవి చర్మమును సహజ కాంతి వంతంగా ఉండేట్టు చేస్తాయి. పుచ్చకాయ గింజల్లో L-ఆర్గినిన్ అనే అమైనా యాసిడ్ ఉంది. ఇది నైట్రిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగేలా చేస్తుంది. ఫలితంగా త్వరగా గాయాలు తగ్గుతాయి.

మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. ఈ గింజలను నీటిలో వేసి మరిగించి టీ లా తాగడం వల్ల కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి, కండరాల కదలికల క్రమబద్ధీకరణలో పుచ్చగింజలు బాగా పనిచేస్తాయి. వేసవి తాపం నుంచి కాపాడుకోవడానికి, శరీరాన్ని చల్లబర్చుకోవడానికి పుచ్చకాయలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.