Gold Theft : అప్పులు తీర్చేందుకు రూ.4 కోట్ల విలువైన బంగారం చోరీ
అప్పులు తీర్చేందుకు ఓ వ్యక్తి తాను పని చేస్తున్న జ్యూవెలరీ స్టోర్ లోనే చోరీకి పాల్పడ్డాడు. రూ.4 కోట్ల విలువైన బంగారం దోచేశాడు.

Gold
Gold stolen from jewelery store : అప్పులు తీర్చేందుకు ఓ వ్యక్తి తాను పని చేస్తున్న జ్యూవెలరీ స్టోర్ లోనే చోరీకి పాల్పడ్డాడు. రూ.4 కోట్ల విలువైన బంగారం దోచేశాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..విరాల్ సోని అనే వ్యక్తి వడోదరలోని జ్యూవెలరీ స్టోర్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు.
అయితే అప్పులు తీర్చడం కోసం తాను పని చేస్తున్న జ్యూవెలరీ స్టోర్ నుంచే 7 కిలోలకు పైగా బంగారం చోరీ చేశాడు. బంగారం అమ్మడంలో అదే స్టోర్‌లో పని చేస్తున్న తరజ్ దివాన్..విరాల్ సోనికి సహకరించాడు. ఎప్పటికప్పుడు ముగ్గురు కస్టమర్ల పేర్లతో నకిలీ వోచర్లను ఇస్తుండటంతో అనుమానించిన క్యాషియర్ యజమానికి ఫిర్యాదు చేశారు.
అయితే విరాల్ సోని 2016 నుంచి 2021 మధ్య కాలంలో 7.8 కిలోల విలువైన 24 కేరట్ల బంగారు నాణేలను చోరీ చేశాడని వడోదర సంస్ధ యజమానులు ఆగస్ట్ 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. షోరూం క్యాషియర్లకు నకిలీ వోచర్లను సమర్పించి గోల్డ్ కాయిన్స్‌ను సోని చోరీ చేశాడని స్టోర్ యజమాని పరేష్ సోని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు విరాల్ సోనిని అరెస్టు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా అప్పులు తీర్చేందుకు, తన కుమారుడి విదేశీ చదువుల కోసం బంగారం చోరీ చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.