Haryana: పల్వాల్ పంచాయత్‭లో విధ్వేష వ్యాఖ్యలు.. ‘అయితే కొట్టండి, లేదంటే చావండి’ అంటూ రెచ్చగొట్టిన గోరక్షక్ దళ్ నాయకుడు

అనుమతి తీసుకునే సమయంలో ఎలాంటి వివాదాస్పద ప్రసంగాలు చేయబోమని ఎస్పీ లోకేంద్ర సింగ్ కు ముందుగానే స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి వ్యక్తి మీద పోలీసు బృందం నిఘా ఉంటుందని, ఏదైనా తప్పు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా

Haryana: పల్వాల్ పంచాయత్‭లో విధ్వేష వ్యాఖ్యలు.. ‘అయితే కొట్టండి, లేదంటే చావండి’ అంటూ రెచ్చగొట్టిన గోరక్షక్ దళ్ నాయకుడు

Updated On : August 13, 2023 / 4:22 PM IST

Acharya Azad Shastri: నూహ్ అల్లర్లు జరిగిన అనంతరం హర్యానాలోని పరిస్థితి చాలా సున్నితంగా మారిపోయింది. దీంతో రాష్ట్రంలో ఎక్కువ మందిని ఒకచోట గుమికూడనివ్వడం లేదు. రాష్ట్రం మొత్తం కట్టుదిట్టమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సభ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్న గోరక్షక్ దళ్.. ముందస్తు అంచనాలను నిజం చేస్తూనే రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించింది. ఆ సంఘ నాయకుడు ఆచార్య ఆజాద్ శాస్త్రి తీవ్రమైన స్వరంతో విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. తమకు 100 లైసెన్స్ ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘అయితే కొట్టండి, లేదంటే చావండి’ అంటూ భిన్న వర్గాల మధ్య విధ్వేషాలకు నిప్పుపెట్టే వ్యాఖ్యలు చేశారు.

Maharashtra Politics: ఇండియా కూటమిలోకి అజిత్ పవార్.. ఎలా సాధ్యమో చెప్పిన సంజయ్ రౌత్

విశ్వహిందూ పరిషత్‌కు చెందిన బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్ర పునఃప్రారంభానికి సంబంధించిన సన్నాహాలను చర్చించేందుకు ఈ మహాపంచాయత్‌కు అనుమతి లభించింది. జూలై 31న నిర్వహించాల్సిన ఈ యాత్రకు హర్యానాలోని నుహ్‌లో హింసాత్మక ఘర్షణల కారణంగా అంతరాయం కలిగింది. అయితే ఈ కార్యక్రమం నిర్వహణకు పల్వాల్ ఎస్పీ లోకేంద్ర సింగ్ పలు షరతులతో అనుమతి ఇచ్చారు.

Independence Day 2023: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి.. ఏం చెప్పారంటే

అనుమతి తీసుకునే సమయంలో ఎలాంటి వివాదాస్పద ప్రసంగాలు చేయబోమని ఎస్పీ లోకేంద్ర సింగ్ కు ముందుగానే స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి వ్యక్తి మీద పోలీసు బృందం నిఘా ఉంటుందని, ఏదైనా తప్పు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. భద్రతా కారణాల దృష్ట్యా మహాపంచాయత్ తొలి అభ్యర్థనను నుహ్ అధికారులు తిరస్కరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అన్ని షరతులు ఉన్నప్పటికీ.. మళ్లీ అవే వ్యాఖ్యలు కనిపించాయి. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు సాగాయి.

Seema Haider vs Raj Thackeray: సీమా హైదర్ కాంట్రవర్సీలో కొత్త ట్విస్ట్.. రంగంలోకి రాజ్ థాకరే టీం. చెప్పింది వినకపోతే రంగు పడుద్దంటూ బెదిరింపులు

మహాపంచాయత్‌లో, హర్యానా గౌ రక్షక్ దళ్‌కు చెందిన ఆచార్య ఆజాద్ శాస్త్రి మాట్లాడుతూ “ప్రస్తుత పరిస్థితి అయితే కొట్టండి, లేదంటే చావండి అన్నట్టుగానే ఉంది” అని అన్నారు. యువకులను ఆయుధాలు పట్టుకోవాలని రెచ్చగొట్టారు. “మేవాత్‌లో 100 ఆయుధాల లైసెన్స్ పొందాలి. తుపాకులు కాకుండా రైఫిల్స్ తీసుకోవాలి. రైఫిల్స్ అయితే ఎక్కువ దూరం కాల్చడానికి వీలు అవుతుంది. ఇది డూ ఆర్ డై పరిస్థితి. ఈ దేశం హిందూ దేశం. కానీ గాంధీ వల్లనే ఈ ముస్లింలు మేవాత్‌లో ఉన్నారు’’ అని ఆజాద్ అన్నారు. మరో విశేషం ఏంటంటే.. ఎఫ్ఐఆర్ పట్ల యువత భయపడవద్దని ఆయన అన్నారు. తనపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని, వాటికి భయపడాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేశారు.