Char dham yatra: చార్ ధామ్ యాత్రికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక సూచన..

భారత దేశంలోని హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్ధ యాత్రల్లో ఉత్తరాఖండ్ చార్ ధామ్ ఒకటి. అద్భుతమైన చార్ ధామ్ యాత్ర అనేది వివిధ దేవతలకు ప్రార్ధనలు చేయడానికి చేపట్టిన తీర్ధయాత్ర. ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్...

Char dham yatra: చార్ ధామ్ యాత్రికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక సూచన..

Chara Dham Yatra

Updated On : May 16, 2022 / 12:43 PM IST

Char dham yatra: భారత దేశంలోని హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్ధ యాత్రల్లో ఉత్తరాఖండ్ చార్ ధామ్ ఒకటి. అద్భుతమైన చార్ ధామ్ యాత్ర అనేది వివిధ దేవతలకు ప్రార్ధనలు చేయడానికి చేపట్టిన తీర్ధయాత్ర. ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్ వంటి గమ్యస్థానాలు ఉంటాయి. శ్రీ ఆది శంకరాచార్య సుమారు 1200 సంవత్సరాల క్రితం చార్ ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి ఈ తీర్ధయాత్ర సాంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతూ వస్తుంది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే యాత్రికులు ప్రతి ఏటా ఏప్రిల్ – మే నెలల్లో తెరిచే నాలుగు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

Uttarakhand Char Dham Yatra : చార్‌ధామ్ యాత్రలో విషాదం.. 12 రోజుల్లో 31 మంది మృతి

ఈ ఏడాది మే 3 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. అయితే యాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 39 మంది మృత్యువాత పడ్డారు. యాత్రలో భాగంగా భక్తులు మార్గ మధ్యలో అనారోగ్యానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ డా. శైలజాభట్ ఆందోళన వ్యక్తం చేశారు. మరణానికి కారణం అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు కారణమన్నారు. పర్వతం ఎక్కడం వలన అలసట చెందడం తదితర కారణాలతో యాత్రికులు మరణిస్తున్నారని తెలిపారు. అందుకని వైద్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాత్రికులు చార్ ధామ్ యాత్రలో ప్రయాణించవద్దని డాక్టర్ శైలజా భట్ సూచించారు.