కొత్త రకం కరోనా : అన్ లాక్ మార్గదర్శకాలను పొడిగించిన కేంద్రం

కొత్త రకం కరోనా : అన్ లాక్ మార్గదర్శకాలను పొడిగించిన కేంద్రం

Updated On : December 28, 2020 / 9:24 PM IST

‘Unlock’ guidelines కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది హోం మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్-19 అన్ లాక్ డిసెంబర్-31తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి-31,2021 వరకు కోవిడ్-19 అన్ లాక్ ను పొడిగిస్తుూ సోమవారం(డిసెంబర్-28,2020) కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తగా కరోనా కేసులలో నిరంతర క్షీణత ఉన్నా ప్రపంచవ్యాప్తంగా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నిఘా, నియంత్రణ, జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కంటైన్‌మెంట్ జోన్‌లను జాగ్రత్తగా గుర్తించడం కొనసాగుతుందన్న కేంద్ర హోంశాఖ.. వైరస్‌ ప్రభావం ఉన్న మండలాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. అనుమతి ఉన్న కార్యకలాపాలు కూడా నిబంధనలకు లోబడే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

మరోవైపు, భారత్ లో ఇప్పటివరకు 1కోటి 2లక్షల 17వేల 777 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా,1లక్షా 48వేల 51మరణాలు నమోదయ్యాయి. 97లక్షల 94వేల 447మంది కరోనా నుంచి కోలుకున్నారు.