Govt Extends Validity Of Motor Vehicle Documents Till October 31
Motor Vehicle Documents validity : వాహనదారులకు గుడ్ న్యూస్.. మోటార్ వెహికల్ డాక్యుమెంట్ల వ్యాలిడిటీని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డాక్యుమెంట్లకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగించింది. వ్యాలిడిటీ ముగిసినప్పటికీ వాహనదారుల డాక్యుమెంట్లకు అక్టోబర్ నెలాఖరు వరకు అనుమతి ఉంటుంది. కరోనా మహమ్మారి దృష్ట్యా వాహనాదారులకు ఈ వెసులుబాటును కల్పించింది. దీనికి సంబంధించి రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది.
Posani Krishna Murali : పోసాని మిస్సింగ్.. ఆందోళనలో నిర్మాతలు..
Driving Licence, Registration Certificate, Fitness వంటి వ్యాలిడిటీ ముగిసిన అన్ని డాక్యుమెంట్లపై అక్టోబర్ 31 వరకు గడువు పొడిగించింది. కరోనా కష్టకాలంలో వాహనదారులు దేశ పౌరులు, వాహనాదారులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 30 గడువు తేదీని మరో నెలవరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ లేఖ రాసింది.
MoRT&H has issued advisory to all States/UTs to extend validity of documents till 31 October 2021. pic.twitter.com/DQicN1tk8C
— MORTHINDIA (@MORTHIndia) September 30, 2021
మోటారు వాహనాల చట్టం, 1988, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్, 1989కు సంబంధించిన మోటార్ వెహికల్ డాక్యుమెంట్ల వ్యాలిడిటీని పొడిగించింది. లాక్ డౌన్ సమయంలో ఫిబ్రవరి 1, 2020 నుంచి వ్యాలిడిటీ ముగిసిన వాహనదారుల అన్ని డాక్యుమెంట్లు అక్టోబర్ 31, 2021 వరకు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. రవాణా సంబంధిత సమస్యలను ఎదుర్కొనే పౌరులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే వాహనాల డాక్యుమెంట్ల వ్యాలిడిటీని కేంద్రం ఆరు సార్లు పొడిగించింది. మార్చి 30, 2020, జూన్ 9, 2020, ఆగస్టు 24, 2020, డిసెంబర్ 27, 2020, మార్చి 26, 2021, జూన్ 17, 2021 తేదీల్లో గడువును పొడిగించింది.
Amazon Festival Sale : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ప్రైమ్ యూజర్లకు బెనిఫిట్స్!