స్నేహం కోసం : బీజేపీకి గ్రేట్ ఖలీ ఎన్నికల ప్రచారం

ఎన్నికల రణరంగాన్ని..మల్లయుధ్దం జరిగే కుస్తీ బరితో పోల్చుతుంటాం..అలాంటి ఎలక్షన్ ప్రచారంలో అకస్మాత్తుగా నిజమైన రెజ్లర్ కన్పిస్తే..అది కూడా wwwf రెజ్లర్.. ఒక్కసారిగా ఆశ్చర్యపోరూ..అదే జరిగింది పశ్చిమ బెంగాల్‌లో.. జాదవ్‌పూర్ బిజెపి అభ్యర్ధికి మద్దతుగా ఫేమస్ రెజ్లర్ గ్రేట్ ఖలీ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన సభలకు జనం విపరీతంగా పోగవుతున్నారు.
పశ్చిమబెంగాల్‌లోని జాదవ్ పూర్ నియోజకవర్గం నుంచి అనుపమ్ హజ్రా బిజెపి తరపున పోటీ చేస్తున్నారు. ఆయనకి మద్దతుగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ ప్రచారం నిర్వహిస్తున్నారు. అనుపమ్ తనకు మంచి దోస్త్ అని..మద్దతిచ్చేందుకు అమెరికా నుంచి వచ్చినట్లు గ్రేట్ ఖలీ చెబుతున్నాడు. పనిలో పనిగా మోడీ మంచి ప్రధాని అంటూ కితాబిచ్చేశాడు. తన మద్దతు ఏ పార్టీకి లేదని.. ఫ్రెండ్ కాబట్టే..అనుపమ్‌కి సపోర్ట్ ఇస్తున్నట్లు చెప్పడం ట్విస్ట్. ఖలీ తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిపారు. తమ మధ్య ఉన్న స్నేహం కారణంగానే ఖలీ తొలిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని అన్నారు.
బిజెపి అభ్యర్ధి అనుపమ్ హజ్రా ప్రచారం సంగతి ఎలా ఉన్నా..రెజ్లర్ కళ్ల ముందు కన్పిస్తుండటంతో లోకల్స్ కాసేపు ఆశ్చర్యానికి లోనయ్యారు. టీవిల్లో కన్పించే ఖలీ సడన్‌గా రోడ్లపై దర్శనమివ్వడం నమ్మలేకపోయారు. ఆ తర్వాత అతనితో కరచాలనం చేయడానికి, సెల్పీలు తీసుకోవడానికి జనాలు ఎగబడ్డారు. అనుపమ్ 2014లో బోల్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి TMC తరఫున MPగా గెలుపొందారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డరంటూ..టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ 2019, జనవరిలో పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో అనుపమ్ మార్చిలో బీజేపీలో చేరారు. అనుపమ్‌కు పోటీగా టీఎంసీ ప్రముఖ బెంగాలీ నటి మిమి చక్రవర్తి బరిలో నిలిచారు.