Groom Shoots Guest: పాటలు పాడాడని గెస్ట్‌ని కాల్చి చంపిన పెళ్లికొడుకు

ముజఫర్ నగర్ లోని ఓ పెళ్లి వేడుకలో పెళ్లికొడుకే అతిథిని చంపిన ఘటన నమోదైంది. మతుడ్ని పెళ్లికూతురు తరపు వ్యక్తి జాఫర్ అలీగా గుర్తించారు.

Groom Shoots Guest: పాటలు పాడాడని గెస్ట్‌ని కాల్చి చంపిన పెళ్లికొడుకు

UP Bride Shot Dead

Updated On : May 10, 2022 / 5:28 PM IST

 

 

Groom Shoots Guest: ముజఫర్ నగర్ లోని ఓ పెళ్లి వేడుకలో పెళ్లికొడుకే అతిథిని చంపిన ఘటన నమోదైంది. మతుడ్ని పెళ్లికూతురు తరపు వ్యక్తి జాఫర్ అలీగా గుర్తించారు. పెళ్లి సెలబ్రేషన్స్ లో భాగంగా.. ఇరు కుటుంబాల వ్యక్తులు ఎంజాయ్ చేస్తున్నారు. డీజే పెడుతున్న పాటల్లో సెలక్షన్ వివాదానికి తెరదీసింది.

అలా జరిగిన వాగ్వాదం కొట్లాటకు దారి తీసింది. పెళ్లికొడుకు ఇఫ్తిఖార్ కాల్పులు జరపడంతో అలీ గాయపడినట్లు ఏఎస్పీ అతుల్ శ్రీవాస్తవ్ తెలిపారు. వెంటనే హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఘటన ప్రభావంగా గ్రామంలో మరే అల్లర్లు జరగకూడదని సెక్యూరిటీ పెంచారు పోలీసులు. పెళ్లికొడుకును అరెస్టు చేసి కేసు ఫైల్ చేశారు.

Read Also : మద్యం మత్తులో మేనల్లుడిపై కాల్పులు