Video: అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన గౌతమ్ అదానీ
అనంత్, రాధిక మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా..

Gautam Adani
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ హాజరయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గౌతమ్ అదానీ ఈ పెళ్లికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
భారత్‌లో ముకేశ్ అంబానీ అత్యంత ధనవంతుడిగా ఉండగా, ఈ జాబితాలో గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. అనంత్, రాధిక మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇవాళ ‘శుభ్ ఆశీర్వాద్’, ఆదివారం మంగళ్ ఉత్సవ్‌తో ఈ మూడు రోజుల పెళ్లి వేడుక ముగుస్తుంది.
దేశంలో అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా అనంత్, రాధిక మర్చంట్ వివాహం నిలుస్తోంది. ఈ వివాహానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహారథులు విచ్చేశారు. రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులతో వివాహ వేదిక కళకళలాడింది. పెళ్లి వేడుక నేపథ్యంలో ముంబైలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ చేశారు.
Adani Group Chairman, Gautam Adani attends Anant Ambani-Radhika Merchant’s wedding ceremony with family, at Jio World Convention Centre in Mumbai#ARWeddingCelebrations #anantradhikawedding #anantambani #ambaniwedding #anantradhika #cnbctv18digital pic.twitter.com/qkofexO3pM
— CNBC-TV18 (@CNBCTV18News) July 13, 2024
Also Read : అనంత్ అంబానీ పెళ్లితో.. బోసిపోతున్న బాలీవుడ్..