Supreme Court : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు

గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. జకియా జాఫ్రీ పిటిషన్ కు సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది

Supreme Court : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు

Supreme Court Backs Clean Chit For Pm On Gujarat Riots

Updated On : June 24, 2022 / 12:50 PM IST

Supreme Court Backs Clean Chit For PM On Gujarat Riots : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. జకియా జాఫ్రీ పిటిషన్ కు సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. గుల్బర్గ్ సొసైటీ మారణకాండలో మరణించిన 68 మందిలో కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2022 గుజరాత్ అల్లర్లలో అప్పుడు గుజరాత్ రాష్ట్ర సీఎంగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ క్లీన్ చిట్ ఇవ్వటం పట్ల సుప్రీంకోర్టు సమర్థించింది. క్లీన్ చిట్ ను వ్యతిరేకిస్తూ నాటి అల్లర్లలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత ధర్మాసనం శుక్రవారం (జూన్ 2022) కొట్టివేసింది.

సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఈనాటి అల్లర్లపై దర్యాప్తు నిర్వహించి మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడం గమనించాల్సిన విషయం. కాగా..ఆనాడు అల్లర్లలోగా కాంగ్రెస్ ఎంపీ జాఫ్రీ సహా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. గోద్రాలో సాధువులతో వెళుతున్న రైలు కోచ్ కు దుండగులు నిప్పు పెట్టడం..ఈ ఘటనలో 59 మంది సాధువులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో అప్పుడు పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

నాటి మత ఘర్షణలపై తాజా దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని..దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటూ, రాజకీయ నాయకులు, పోలీసుల పాత్ర ఉందని ఆరోపిస్తూ.. జకియా జాఫ్రీ సుప్రీంకోర్టును కోరారు. ఈ కుట్రలో రాజకీయ నాయకులు, పోలీసుల పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. కానీ జకియా జాఫ్రీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని..సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు ఆనాటి ఘటనపై తాజా దర్యాప్తు ఇవ్వటానికి ఎటువంటి ఆధారాల్లేవని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. సిట్ 2012 ఫిబ్రవరిలో దర్యాప్తు ముగింపు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడమే కాకుండా.. మోడీతోపాటు మరో 63 మందికి సంబంధించి ఎటువంటి ఆధారాల్లేవని ఈ సందర్బంగా సుప్రీంకోర్టు పేర్కొంది.