Gyanesh Kumar: నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నియామకం.. ఎవరీ జ్ఞానేశ్..? ఈసీగా వివేక్ జోషి ..

కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా జ్ఞానేశ్ కుమార్, అదేవిధంగా ఎన్నికల కమిషనర్ (EC)గా వివేక్ జోషి నియమితులయ్యారు.

Gyanesh Kumar: నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నియామకం.. ఎవరీ జ్ఞానేశ్..? ఈసీగా వివేక్ జోషి ..

Gyanesh Kumar

Updated On : February 18, 2025 / 7:10 AM IST

Gyanesh Kumar: కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్ (EC)గా వివేక్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వారి పేర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.

2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇవి. తొలుత సీఈసీ, ఈసీ పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను నోటిఫికేషన్లలో వెల్లడించారు. ఆ తరువాత త్రిసభ్య కమిటీ ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేశారు. దీంతో సోమవారం రాత్రి రాష్ట్రపతి ఆమోదంతో సీఈసీగా జ్ఞానేశ్ కుమార్, ఈసీగా వివేక్ జోషి పేర్లను వేరువేరు గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దీంతో 26వ భారత ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.

Also Read: TRAI new rules: మీ కోసం ట్రాయ్ గేమ్ ఛేంజర్ నిర్ణయం.. ఇక స్పామ్ కాల్స్ బాధ వదిలిపోతుంది పో..

ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది. దీంతో సోమవారం ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం అయింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇవి. అయితే, కొత్త చట్టం ప్రకారం సీఈసీని నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఈనెల 19న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ ముగిసే వరకు కొత్త సీఈసీపై నిర్ణయాన్ని వాయిదా వేయాలని సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం.

Also Read: Ayodhya Ram Mandir Income : 700 కోట్లు.. అయోధ్య రామాలయానికి కళ్లు చెదిరే ఆదాయం, దేశంలోనే థర్డ్ ప్లేస్..

జ్ఞానేశ్వర్ కుమార్ కేరళ క్యాడర్ కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అతని వయస్సు 61యేళ్లు. గతేడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా నియమితులయ్యారు. జ్ఞానేశ్వర్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాక.. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కూడా కొనసాగారు. జ్ఞానేశ్ కుమార్ హోంమంత్రిత్వ శాఖలో ఉన్నసమయంలో రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ ఏర్పాటులో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆర్టికల్ 370 రద్దు చేయబడినప్పుడు ఆయన హోం మంత్రిత్వ శాఖలోని జమ్మూ కశ్మీర్ విభాగానికి బాధ్యత వహించారు. ఆ తరువాత సహకార శాఖ కార్యదర్శిగా 2024 జనవరిలో పదవీ విరమణ చేశారు.

 

జ్ఞానేశ్ కుమార్ సీఈసీ స్థానంలో 2029 జనవరి 26వ తేదీ వరకు కొనసాగుతారు. ఆయన పర్యవేక్షణలో బిహార్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.