saravana bhavan : సాంబార్ లో సగం బల్లీ..మిగతా సగం ?

ఓ రెస్టారెంట్ కు వచ్చిన వారికి షాక్ తగిలింది. దోస -సాంబార్ ఆర్డర్ చేశారు. కానీ…సాంబార్ లో చచ్చిపోయిన బల్లీని చూసి నోరెళ్లబెట్టారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
లగ్జరీ హోటల్స్, ఆహార పదార్థాలకు పేరొందిన మార్కెట్ లో saravana bhavan ఉంది. వీకెండ్ లో ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్ తీసుకొనేందుకు క్యూ కడుతుంటారు. సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ప్రసిద్ధి పొందిన రెస్టారెంట్ కు కొంతమంది వచ్చారు.
దక్షిణాదిలో ఎంతో ఇష్టమైన దోశ – సాంబార్ ను ఆర్డర్ చేశారు. దోశను సాంబార్ లో నంచుకుని తిన్నారు. కాసేపటికే షాక్ తిన్నారు. సగం బల్లి దర్శనమిచ్చింది. దీనిని రెస్టారెంట్ వారిని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.
ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ లలో శరవణ్ భవన్ ఒకటి. 39 అవుట్ లెట్లు, విదేశాల్లో 87 బ్రాంచెస్ ఉన్నాయి. 1981లో చెన్నైలో స్థాపించిన సంగతి తెలిసిందే.