ఇక కష్టమే: సిగ్నల్ అందుకోకపోవడానికి కారణాలు ఇవే

ఇక కష్టమే: సిగ్నల్ అందుకోకపోవడానికి కారణాలు ఇవే

Updated On : September 15, 2019 / 7:03 AM IST

చంద్రునిపై అడుగుపెట్టబోతుందన్న తరుణంలో సిగ్నల్ కోల్పోయిన ల్యాండర్ విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయింది. విక్రమ్ లో నిక్షిప్తమై ఉన్న బ్యాటరీ సామర్థ్యం 14రోజుల వరకూ మాత్రమే పనిచేస్తుంది. ఈలోపే విక్రమ్ నుంచి సిగ్నల్స్ అందుకోవాలని ప్రయత్నిస్తున్న ఇస్రోకు ప్రతిఫలం దక్కడం లేదు. సాంకేతిక కారణాలతో సిగ్నల్ కోల్పోయిన విక్రమ్ మరోసారి అందుకోవడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతున్నారు. 

* దీనికి కారణం చంద్రతలంపై హార్డ్ ల్యాండింగ్ అవడమే అంటున్నారు సీనియర్ శాస్త్రవేత్తలు. ల్యూనార్ ఆర్బిట్ నుంచి విడిపోయి వారం దాటిపోతున్నా సిగ్నల్ అందుకోలేకపోతుంది. దీనిపై ఇస్రో మాజీ శాస్త్రవేత్త, చంద్రయాన్-1 ప్రాజెక్టు డైరక్టర్ ఎమ్ అన్నాదురై స్పందించారు. 

* ‘చంద్రుడిని చేరుకోవడానికి 335మీటర్ల దూరం ఉండగానే సిగ్నల్ కోల్పోయాం. దాంతో అది హార్డ్ ల్యాండింగ్ కు గురైంది. వేగం తీవ్రత తగ్గించుకోకుండా ల్యాండ్ అవడమే సమస్యగా మారింది. అందుకే సిగ్నల్ అందుకోలేకపోతుంది’ అని వివరించారు. 

* ఇస్రో మాజీ డైరక్టర్ పీఎస్ వీర రాఘవన్ స్పందిస్తూ.. చంద్రుడికి, భూమికి మధ్య కేవలం 1.25సెకన్ల కాల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఈ గ్యాప్ లో సిగ్నల్ అందుకోలేకపోయామంటే పర్మినెంట్ గా సిగ్నల్ కోల్పోయినట్లే’ అని తెలిపాడు. 

* మంగళవారం ఇస్రో ఇలా తెలిపింది. ‘విక్రమ్ ల్యాండర్ ను ఆర్బిటర్ కనిపెట్టింది. కానీ కమ్యూనికేషన్ కుదరడం లేదు. సిగ్నల్ అందుకోవడానికి చివరి క్షణం వరకూ పోరాటం చేస్తాం’ అని పేర్కొన్నారు. 

* గురువారం ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ. తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని ఎటువంటి సిగ్నల్స్ అందుకోలేకపోతున్నామని వెల్లడించారు. ల్యాండ్ అవడానికి ముందే సిగ్నల్ కోల్పోయామని గుర్తు చేశారు.