Ministers Resign :కేబినెట్ విస్తరణ ముందే..కేంద్ర మంత్రుల వరుస రాజీనామాలు!

ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కేంద్రంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Ministers Resign :కేబినెట్ విస్తరణ ముందే..కేంద్ర మంత్రుల వరుస రాజీనామాలు!

Ministers2

Updated On : July 7, 2021 / 3:52 PM IST

Ministers Resign ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కేంద్రంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త వాళ్లకు కేబినెట్ లో చోటు కల్పించే క్రమంలో ఇప్పటికే కేబినెట్ లో ఉన్న పలువురు నేతలకు ఉద్వాసన పలుకుతున్నారు. ఇవాళ 12మంది కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్,కార్మికశాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్,కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్,రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ,మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబశ్రీ చౌదరి,విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్ షామ్ రావ్ ధోత్రీ,జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కతారియా,బాబుల్ సుప్రీయో,ప్రతాప్ సరంగి సహా 12మంది మ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఇంకా పలువురు మంత్రులు కేబినెట్ విస్తరణకు ముందే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నట్లు సమాాచారం.