Om Prakash Chautala : పది పాసైన మాజీ సీఎం
86ఏళ్ల లేటు వయసులో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించారు హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతలా. శనివారం విడుదలైన ఫలితాల్లో ఇంగ్లీష్ లో 100కు 88 మార్కులు సాధించారు.

Om Prakash Chautala
Om Prakash Chautala : హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతలా తాజాగా పది పరీక్ష రాసిన విషయం తెలిసిందే. 86 ఏళ్ల లేటు వయసులో గతంలో తప్పిన పది ఇంగ్లీష్ పరీక్ష రాశాడు. ఈ పరీక్షల ఫలితాలను హర్యానా విద్యా బోర్డు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఆయన ఇంగ్లీష్ సబ్జెట్ లో 100కు 88 మార్కులు సాధించి ఉత్తీర్ణుడయ్యారు.
చౌతాలా పదోతరగతి పాస్ కాకముందే ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. కరోనా సమయంలో ఆయన ఓపెన్ ఇంటర్ పరీక్ష ఫీజు కట్టారు. పరీక్షలు రాయకుండానే పాసైపోయారు. అయితే పదోతరగతి ఉత్తీర్ణత లేకపోవడంతో ఆ ఫలితాలను ఇంటర్ బోర్డు నిలిపివేసింది. పది పాస్ అయితేనే ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే గతంలో తప్పిన పరీక్ష ఇప్పుడు గుర్తుకు వచ్చి గత నెలలో పరీక్ష రాశాడు. ఈ రోజు ఆ ఫలితాలు వచ్చాయి. ఇక ఇంటర్ కూడా కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే పాస్ చేశారు. దీంతో చౌతలా కూడా ఇంటర్ పరీక్షలు రాయకుండానే పాస్ అయ్యారు. ఒక్క దెబ్బతో టెన్త్, ఇంటర్ పట్టాలు పొందారు.