Haryana Govt : మేకప్ వేసుకుని, నగలు ధరించి, పిచ్చి హెయిర్ స్టైల్స్‌తో ఆసుపత్రికి రావొద్దు’ డాక్టర్లకు, సిబ్బందికి ప్రభుత్వం ఆదేశం

డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది నగలు ధరించి, మేకప్ వేసుకుని ఆస్పత్రికి రావద్దని హర్యానా గవర్నమెంట్ ఆదేశించింది. ఫంకీ హెయిర్ స్టైల్ వేసుకోరాదని.. రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌ స్పష్టంచేశారు.

Haryana Govt : మేకప్ వేసుకుని, నగలు ధరించి, పిచ్చి హెయిర్ స్టైల్స్‌తో ఆసుపత్రికి రావొద్దు’ డాక్టర్లకు, సిబ్బందికి ప్రభుత్వం ఆదేశం

Haryana Govt Doctors dress code

Updated On : February 14, 2023 / 9:09 AM IST

Haryana Govt Doctors dress code :  ప్రభుత్వ డాక్టర్లు..ఆస్పత్రి సిబ్బందికి డ్రెస్ కోడ్ ను ప్రవేశపెట్టింది హర్యానా ప్రభుత్వం. ఆస్పత్రిలో సిబ్బంది అంతా డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని హర్యానా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి శుక్రవారం (ఫిబ్రవరి 10,2023) ఆదేశాలు జారీ చేశారు.డాక్టర్లు గానీ, సిబ్బంది గానీ నగలు ధరించి మేకప్ వేసుకుని ఆస్పత్రికి రావద్దని ఆదేశించారు. అలాగే ఫంకీ హెయిర్ స్టైల్ వేసుకోరాదని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు క్రమశిక్షణగా ఉండాలని అందరు సమానత్వం పాటించాలనే ఉద్దేశంతో ఈ డ్రెస్‌ కోడ్‌ పాలసీని రూపొందించామని నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు.

యూనిఫామ్ డిజైన్ తుది దశలో ఉందని ఈ డ్రెస్ కోడ్ అమలులోకి వచ్చాక డాక్టర్లతో పాటు ఆస్పత్రి సిబ్బంది అంతా వారి వారికి ఆదేశించిన డ్రెస్ కోడ్ పాటించాలని ఏ ఒక్కరు యూనిఫాం లేకుండా ఆస్పత్రిలో కనిపించకూడదని స్పష్టంచేశారు. ఆస్పత్రిలో రోగికి, సిబ్బందికి మధ్య వ్యత్యాసం తెలియటంలేదని ఎవరు ఆస్పత్రి సిబ్బందో ఎవరు రోగులో? లేక వారి బంధువులో తెలియటంలేదని అటువంటి తేడా ఈ డ్రెస్ కోడ్ తో స్పష్టంగా తెలుస్తుందని మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఈ డ్రెస్ కోడ్ వల్ల ఆస్పత్రి సిబ్బంది మెరుగుపడుతుందని..వారి వారి డ్రెస్ కోడ్ వల్ల క్రమశిక్షణ అలవడుతుందని వారికి ఆ డ్రెస్ నిరంతరం గుర్తు చేస్తుందని అన్నారు మంత్రి.అంతేకాదు రోగులకు ఈ డ్రెస్ కోడ్ వల్ల డాక్టర్లు, సిబ్బందిపై గౌరవం పెరుగుతుందన్నారు.

అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోను ఈ డ్రెస్ కోడ్ నిబంధన తప్పనిసరి అని తెలిపారు మంత్రి. మరి ముఖ్యంగా ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే డాక్టర్లు, ఇతర సిబ్బంది డ్యూటీలో ఉన్న సమయంలో విచిత్రమైన హెయిర్‌స్టైల్స్ వేసుకుంటున్నారని పైగా భారీ నగలు ధరిస్తున్నారని. మేకప్ లు కూడా వేసుకుంటున్నారని..అంతేకాదు పొడవాటి గోళ్లు..వాటికి నెయిల్ పాలిష్ లు వేసుకుంటున్నారని ఇకనుంచి అటువంటివి కుదరదు డ్రెస్ కోడ్ తో పాటు అన్ని నిబంధనలు పాటించి తీరాలన్నారు. కొంతమంది అయితే స్కర్టులు కూడా ధరించి వస్తున్నారని అన్నారు. ఆస్పత్రిలో పురుషులుపిచ్చి పిచ్చి హెయిర్‌స్టైల్స్..మోడర్న్‌ హెయిర్‌కట్‌ చేసుకుని రావొద్దని తెలిపారు. అలాగే సిబ్బంది గోళ్లు శుభ్రంగా ఉండాలని స్పష్టంచేశారు. టీషర్టులు, జీన్స్‌లు, స్కర్టులు, లెదర్‌ ప్యాంట్లు, క్రాప్‌టాప్స్, ఆఫ్ షోల్డర్ డ్రెస్సులు, స్నీకర్లు, ఇకనుంచి ఆస్సత్రికి అనుమతించబడవని స్పష్టంచేశారు. ఇటువంటివి దుస్తులు వైద్య వృత్తికి ఏమాత్రం సూట్ అవ్వవని అన్నారు మంత్రి. పక్కగా ప్రొఫెషనల్‌గా కన్పించే ఫార్మల్‌ దుస్తులనే ఇకపై ధరించాలని.. నర్సింగ్‌ క్యాడర్‌ మినహా ట్రైనీలు తప్పనిసరిగా బ్లాక్ ప్యాంట్‌, వైట్ షర్ట్‌ ధరించాలి అని మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు.

ఈ డ్రెస్‌కోడ్‌ (Dress Code)ను సిబ్బంది తప్పనిసరిగా పాటించాలని మంత్రి స్పష్టంచేశారు. అలాగే నైట్‌ షిప్టుల్లోనే ఉన్న సిబ్బందికి కూడా డ్రెస్ కోడ్ పాటించి తీరాలన్నారు. నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారికి కూడా ఎటువంటి మినహాయింపులు లేవన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రెస్‌ కోడ్‌ పాటించని ఉద్యోగిని ఆ రోజు ఆప్సెంట్ గా పరిగణిస్తామని మంత్రి స్పష్టంచేశారు.